ఫ్రాన్స్‌‌లో 51 మంకీపాక్స్ కేసులు

ఫ్రాన్స్‌‌లో 51 మంకీపాక్స్ కేసులు

ప్రపంచాన్ని మంకీపాక్స్ వణికిస్తోంది. పలు దేశాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్‌‌లో కేసుల సంఖ్య రోజు రోజుకు అధికమౌతున్నాయి. తాజాగా 51 మంకీపాక్స్ కేసులను గుర్తించిందని ఫ్రెంచ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. 22 నుంచి 63 ఏళ్ల వయస్సున్న పురుషుల్లో ఈ వైరస్ గుర్తించినట్లు, ఒకరు మాత్రమే ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. వైరస్ వ్యాపిస్తుందని తాము ఊహించలేదని ఫ్రెంచ్ ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. దేశంలో తగినంత వ్యాక్సిన్ నిల్వలున్నాయన్నారు. వీలైనంత తొందరగా వ్యాక్సిన్ లు వేయించుకోవాలని ప్రజలకు సూచించారు.

యూరోపియన్ దేశాల్లో మొదటి కేసును గుర్తించిన సంగతి తెలిసిందే. ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదని, తరచుగా జ్వరం, కండరాల నొప్పులు, చలి, అలసట, చర్మంపై చికెన్ పాక్స్ వంటి దద్దుర్లు వస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ వైరస్ రెండు నుంచి నాలుగు వారాల తర్వాత నయం అవుతుందని WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) తెలిపింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 700 మంది మంకీపాక్స్ తో బాధ పడుతున్నట్లు అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. దేశంలో 21 కేసులు నమోదైనట్లు తెలిపింది. 

మరిన్ని వార్తల కోసం : -
వంద రోజుల యుద్ధం..ఎన్నో బతుకులు శిథిలం


పుతిన్ ప్రేయసి గౌరవార్థం రష్యాలో క్రీడోత్సవం