బ్యాక్ డోర్ జాబ్ ల పేరుతో మోసం

బ్యాక్ డోర్ జాబ్ ల పేరుతో మోసం
  • రూ.40 లక్షలు వసూలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు

జీడిమెట్ల, వెలుగు: సాఫ్ట్​వేర్ ​కంపెనీల్లో బ్యాక్ డోర్ ద్వారా జాబ్​లు ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై జగద్గిరిగుట్ట పీఎస్​లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా నారాయణ లంక మండలం భవధారపల్లికి చెందిన మలిశెట్టి గోపిచంద్ సిటీకి వచ్చి అల్విన్ కాలనీలో ఉంటున్నాడు. సోమాజిగూడలోని క్వాంట్ క్లౌడ్ సొల్యూషన్​లో బ్యాక్ డోర్ ద్వారా జాబ్ ఇప్పిస్తానని స్థానికంగా ఉండే  దూరపు బంధువు బన్​రెడ్డి వెంకట Sనాగపూర్ణ కిశోర్​ను గోపిచంద్ నమ్మించాడు.

ఇందుకోసం కిశోర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్​లో  రూ.2 లక్షల 30 వేలు తీసుకున్నాడు. ఇలా గోపిచంద్ మరికొందరిని నమ్మించి సుమారు రూ.40 లక్షలు వసూలు చేశాడు. వారికి ఆన్​లైన్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి గత నెల 21న జాయినింగ్ డేట్ అని పేర్కొంటూ ఆఫర్ లెటర్లు సైతం ఇచ్చాడు. అయితే, బాధితులు సదరు కంపెనీ అడ్రెస్​కు వెళ్లగా.. అక్కడ ఎలాంటి ఆఫీసు లేదని తెలిసింది. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు గోపిచంద్​పై జగద్గిరిగుట్ట పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.