సౌందర్ రాజన్ కు తుది వీడ్కోలు..చిలుకూరులో భక్తజన సందోహం మధ్య ముగిసిన అంత్యక్రియలు

సౌందర్ రాజన్ కు తుది వీడ్కోలు..చిలుకూరులో భక్తజన సందోహం మధ్య ముగిసిన అంత్యక్రియలు

చేవెళ్ల, వెలుగు: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానర్చకులు, ఆలయ మేనేజింగ్​ డైరెక్టర్​ సౌందర్ రాజన్ కు భక్తజనులు తుది వీడ్కోలు పలికారు. వృద్దాప్య సమస్యలతో శుక్రవారం సాయంత్రం ఆయన మృతిచెందగా, కుటుంబ సభ్యులు శనివారం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్​ విప్​ పట్నం మహేందర్​ రెడ్డి, బీఆర్ఎస్  సీనియర్  నాయకులు రాకేశ్ రెడ్డి, కొంపల్లి అనంత్​రెడ్డి, మొయినాబాద్  మున్సిపల్  వైస్  చైర్మన్  గరుగు రాజు ముదిరాజ్, మాజీ సర్పంచ్  నరోత్తం రెడ్డి, వేలాది మంది భక్తులు అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు