గుడ్ న్యూస్: ఏపీలో ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్... ఇవాళ్టి నుంచే అమలు..

గుడ్ న్యూస్: ఏపీలో ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్... ఇవాళ్టి నుంచే అమలు..

ఏపీలో విద్యార్థుల కోసం ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్ క్యాంపులను నిర్వహిస్తోంది ప్రభుత్వం. అంగన్వాడి కేంద్రాలు, స్వర్ణ గ్రామాలు, వార్డుల్లో ఇవాళ్టి ( మే 12 ) నుంచి 15వరకు, తిరిగి 19 నుంచి 22 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. రాష్ట్రంలో సుమారు 11 లక్షల 99 వేల మంది విద్యార్థులు తమ ఆధార్ అప్ డేట్ చేసుకోవాల్సి ఉందని గుర్తించామని తెలిపారు అధికారులు.

విద్యార్థులు ఈ ఉచిత సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అధికారులు. నిబంధనల ప్రకారం ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు వయసు దాటిన తర్వాత ఆధార్ లో బయోమెట్రిక్ వివరాలను అప్ డేట్ చేసుకోవాలని... ఈ క్రమంలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ సేవలను విద్యార్థులు అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.

నిబంధనల ప్రకారం 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆధార్‌లో బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. అందుకే 5 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు వారు వెంటనే వారి ఆధార్ వివరాలను అప్డే్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.