మే 3న దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ

మే 3న  దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ

పంజాగుట్ట, వెలుగు: నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ చేయనున్నట్లు హైదరాబాద్ ఆశ్రమం హెడ్ మహేంద్ర సింగ్ రావత్ తెలిపారు. శుక్రవారం సోమాజీగూడ ప్రెస్‌‌క్లబ్‌‌లో సంస్థ పేట్రన్ అల్కా చౌదరితో కలిసి శిబిరానికి సంబంధించిన వాల్​పోస్టర్​ను ఆవిష్కరించారు. 

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌లో ఈ నెల 3న పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. శిబిరంలో ముందుగా ఎంపికైన 745 మంది దివ్యాంగులకు మొత్తం 815 నారాయణ మాడ్యులర్ కృత్రిమ అవయవాలు, కాలిపర్లు అందజేయనున్నట్లు చెప్పారు. వాటి వినియోగంపై ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిబిర ఇన్​చార్జి హరిప్రసాద్ లడ్డ పాల్గొన్నారు.