వినికిడి లోపం.. ఐదేండ్లలోపు పిల్లలకు ఫ్రీగా సర్జరీ

వినికిడి లోపం.. ఐదేండ్లలోపు పిల్లలకు ఫ్రీగా సర్జరీ
  • ఈ నెల 24న  మెడికల్​ క్యాంపు 
  •  బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: వినికిడి లోపంతో బాధ పడుతోన్న  ఐదేండ్లలోపు పిల్లలకు ఫ్రీగా ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తామని కేర్ హాస్పిటల్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ కూడా ఉచితంగా చేయిస్తామని బుధవారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఈ నెల 24న బంజారాహిల్స్‌‌‌‌లోని కేర్ ఔట్ పేషెంట్ యూనిట్‌‌‌‌లో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫ్రీ కన్సల్టేషన్, మెడికల్​ టెస్ట్​లు చేయనున్నట్టు పేర్కొంది.  వినికిడి లోపం, మాట్లాడలేకపోవడం, ఎదుటి వారి మాటలను అర్థం చేసుకోలేకపోవడం వంటి సమస్యలు ఉన్న పిల్లలను పరీక్షించి, అవసరమైన వైద్య సాయం అందజేస్తామని చెప్పింది.   వివరాల కోసం   9391208886 నంబర్‌‌‌‌‌‌‌‌లో సంప్రదించాలని సూచించింది.