మార్చి తర్వాత ఫ్రీగా విద్య, వైద్యం

మార్చి తర్వాత ఫ్రీగా విద్య, వైద్యం
  • రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు 

పాలకుర్తి: తెలంగాణ రాష్ట్రంలో మార్చి తర్వాత  ఫ్రీగా విద్య, వైద్యం  అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. మంగళవారం జనగాం జిల్లా పాలకుర్తి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రికి ఉచితంగా విద్య, వైద్యం అందించాల‌నేది కేసీఆర్ చిరకాల కోరికన్నారు. దీనికి సంబంధించిన సాధ్యా సాధ్యాల‌ను సీఎం ప‌రిశీలిస్తున్నార‌ని మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారని, కొత్త కొత్త పథకాలతో రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా నడిపిస్తున్నారన్నారు. సాగు నీరు సమృద్ధిగా అందుతుండటంతో పల్లెలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. వీలైనంత త్వరగా ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని రాష్ట్ర వ్యాప్తంగా  అమలు చేయాల‌ని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే రూ. 20 వేల కోట్ల‌ు విడుద‌ల చేయ‌నున్నార‌ని అన్నారు. 

మరికొన్ని వార్తల కోసం:
బైక్ను ఢీకొన్న ట్రైన్.. తృటిలో తప్పించుకున్న యువకుడు