బైక్ను ఢీకొన్న ట్రైన్.. తృటిలో తప్పించుకున్న యువకుడు

బైక్ను ఢీకొన్న ట్రైన్.. తృటిలో తప్పించుకున్న యువకుడు
  • రెడ్ సిగ్నల్ ని లెక్క చేయని యువకుడు   

ముంబయి: రైల్వే లెవల్ క్రాసింగ్ దాటుతుండగా ద్విచక్రవాహనదారున్ని ట్రైన్ ఢీకొట్టిన సంఘటనలో ఓ యువకుడు తృటిలో తప్పించుకున్నాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ముంబైలో జరిగింది. ఇప్పడు ఈ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీసీటీవీ, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... ముంబై రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే లెవల్ క్రాసింగ్ ఉంది. ట్రైన్ వస్తోందన్న సమాచారంతో ఆ క్రాసింగ్ ను మూసివేశాడు గేట్మేన్. దీంతో క్రాసింగ్ కు ఇరువైపుల చాలామంది వాహనదారులు నిలిచిపోయారు.

కానీ ఓ ద్విచక్రవాహనదారుడు మాత్రం ఇవేం పట్టించుకోలేదు. ఇంటికి త్వరగా వెళ్లాలనే తొందరలో ట్రాఫిక్ రూల్స్ మరిచాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. గేట్మేన్, తోటి వాహనదారులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా తన బైక్ ను స్టార్ట్ చేశాడు. స్పీడ్ గా ముందుకు పోనిచ్చాడు. కానీ బైక్ ట్రాక్ మీదకి రాగానే అటుగా దూసుకొస్తున్న ట్రెయిన్ని గమనించిన ఆ యువకుడు.. రన్నింగ్ బైక్ మీద నుంచి వెనక్కి దూకాడు. అతడు అలా దూకాడో లేదో శరవేగంతో బైక్ ను ఢీకొడుతూ దూసుకెళ్లింది రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. సెకన్ల తేడాతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడా యువకుడు. అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనంతరం ఆ యువకుడికి గట్టి క్లాస్ కూడా తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఇప్పడు ఈ వీడియో వైరల్ కావడంతో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగతాయని కొందరూ, రూల్స్ బ్రేక్ చేసేవారికి ఇలాంటి వీడియోలు చూపించాలని మరికొందరూ కామెంట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోెసం:

పూలు పూయించలేదని...తోటమాలీలను జైళ్లో పెట్టిన కిమ్