పూలు పూయించలేదని...తోటమాలీలను జైళ్లో పెట్టిన కిమ్

పూలు పూయించలేదని...తోటమాలీలను జైళ్లో పెట్టిన కిమ్

కిమ్ జాంగ్ ఉన్... పరిచయం అక్కర్లేని పేరు. ఉత్తర కొరియా అధ్యక్షుడు. అందరు షార్ట్ గా కిమ్ అని పిలుస్తుంటారు. తన రూటే సెపరేటు అన్నట్లు బిహేవ్ చేస్తుంటాడు కిమ్. ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటాడో... అసలు ఎందుకు తీసుకుంటాడో చెప్పడం కష్టం. అక్కడ ఆయన మాటే శాసనం. తనకు ఎదురు తిరిగితే ఇక అంతే సంగతులు. ప్రజలను గడగడలాడిస్తుంటాడు. తప్పు చిన్నదైన సరే శిక్ష మాత్రం గట్టిగా ఉండాలంటాడు. ఎప్పుడు ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూ వార్తల్లో నిలస్తుంటాడు. ఇప్పుడు అలాంటి ఓ విచిత్రమైన డెసిషన్ తీసుకున్నాడు కిమ్. పూలు పూయించలేదని ఇద్దరు వ్యక్తులకు 6 నెలల జైలు శిక్ష విధించాడు.
అసలు ఏం జరిగిందంటే...
కిమ్ తండ్రియైన కిమ్ జోంగ్ ఉన్ పుట్టిన రోజు (ఫిబ్రవరి 16)ని ఉత్తర కొరియా ఓ పెద్ద పండుగలా జరుపుకుంటుంది. దీనిని షైనింగ్ స్టార్ డే అని పిలుస్తారు. ఇదే అక్కడ అతి పెద్ద హాలిడే వెకేషన్. కిమ్ తండ్రి 2011లో మరణించాడు. తండ్రి స్మారకార్థం కిమ్ ఓ పెద్ద గార్డెన్ నిర్మించి దాని మధ్యలో తన తండ్రి సమాధిని పెట్టించాడు. ఏటా తన తండ్రి పుట్టిన రోజున ఆ గార్డెన్ లో కింజోంగిలియా అనే ఎర్రటి పూల  మొక్కలు నాటిస్తుంటాడు. ఈ సారి కూడా అవే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాడు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు పూల మొక్కలను నాటించి.. నిర్వహణ బాధ్యతను ఇద్దరు తోటమాలీలకు అప్పగించారు. అయితే ఇటీవల ఉత్తర కొరియాలో విపరీతమైన మంచు కురిసింది. దీంతో మొక్కలను పెంచేందుకు సరైన వాతావరణం లేక తోటమాలీలు ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈ పూలు పూచేందుకు గ్రీన్ హౌస్ బాయిలర్లను ఉపయోగిస్తారు. మంచు కారణంగా వంట చెరుకు లభించకపోవడంతో బాయిలర్లు పని చేయలేదు. దీంతో కింజోంగిలియా మొక్కలు పూలు పూయలేదు. విషయం తెలసుకున్న కిమ్... తన తండ్రి బర్త్ డేకి ఇంకా నాలుగు రోజుల గడువే ఉండటంతో కోపంతో ఊగిపోయాడు. వెంటనే బాయిలర్ నిర్వాహకుడికి 3 నెలలు, తోటమాలికి 6 నెలల పాటు కఠిన శిక్ష విధిస్తూ జైల్లో పెట్టాడు. దీంతో కిమ్ తండ్రి పుట్టిన రోజు తమ చావు మీదకొచ్చేటట్లుందని  ఉత్తర కొరియా ప్రజలు భయంతో వణుకుతున్నారు.

మరిన్ని వార్తల కోసం:

కేసీఆర్.. నిరుద్యోగులు నిన్ను తరమకుండా చూస్కో

భారీ ధరకు అమ్ముడుపోయిన భారత స్టార్ బ్యాట్స్మన్