కేసీఆర్.. నిరుద్యోగులు నిన్ను తరమకుండా చూస్కో

కేసీఆర్.. నిరుద్యోగులు నిన్ను తరమకుండా చూస్కో

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోమారు విమర్శలకు దిగారు. జనగామ సభలో ఢిల్లీ కోటలు బద్దలు కొడతామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. ఢిల్లీ కోటలు బద్దలు కొట్టుడు కాదు.. ముందు రాష్ట్రంలో ఆగమైతున్న రైతులను నిలబెట్టాలన్నారు. రోజుకిద్దరుగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకోవాలన్నారు. ‘మోడీని దేశం నుంచి తరుముడు ఏమో గానీ.. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరమకుండా చూస్కో. మీరు పులి బిడ్డయితే మొన్న మీ మెడ మీద లేని కత్తిని చూసి వడ్లు కొననని ఎట్లా రాసిచ్చారు దొరగారు? నిన్నటిదాకా కేంద్రానికి వంతపాడి ఈరోజు ఉడుతఊపుల పంచాయితీ పెట్టినవా? రాష్ట్రంలోని సమస్యలనే పరిష్కరించడం చేతకాని మీరు దేశ రాజకీయాలు చేస్తారా? గాలిలో మేడలు.. పగటి కలలు.. ఓట్ల కోసం తిప్పలు’ అని షర్మిల ట్వీట్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

భారీ ధరకు అమ్ముడుపోయిన భారత స్టార్ బ్యాట్స్మన్

హిజాబ్ వివాదంపై స్పందించిన విదేశాంగ శాఖ 

షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ స్టార్ హీరో