హిజాబ్ వివాదంపై స్పందించిన విదేశాంగ శాఖ 

హిజాబ్ వివాదంపై స్పందించిన విదేశాంగ శాఖ 

న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో డ్రెస్ కోడ్ కు సంబంధించిన విషయంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందామ్ బాగ్చి స్పందించారు. ఇండియాలోని విద్యాసంస్థల్లో డ్రెస్ కోడ్, హిజాబ్ పై చెలరేగుతున్న వివాదం మీద వివిధ దేశాలు చేసిన కామెంట్ల గురించి మీడియా ప్రశ్నిస్తోందని బాగ్చీ అన్నారు. అయితే విద్యాసంస్థల్లో డ్రైస్ కోడ్ అంశంపై కర్ణాటక హైకోర్టులో న్యాయ విచారణ జరుగుతోందన్నారు. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. భారత్ గురించి బాగా తెలిసిన వారు.. ఇలాంటి వాస్తవాలను గుర్తిస్తారని చెప్పారు. ఇండియా అంతర్గత వ్యవహారాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలను స్వాగతించబోమని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ స్టార్ హీరో

కేసీఆర్ నశం పెడితే మేం జండూబామ్ పెడతాం

ఎవరు మీలో కోటీశ్వరులు.. ఐపీఎల్ వేలానికి వేళాయెరా!