
హైదరాబాద్, వెలుగు : రాజ్‌భవన్‌రోడ్ సోమాజిగూడలో ఉన్న శ్రీశ్రీ రవిశంకర్ విద్యామందిర్స్కూల్లో ఆదివారం నిర్వహించిన ఫ్రీ హెల్త్క్యాంప్నకు విశేష స్పందన లభించింది. ఈ క్యాంప్ నకు సుమారు 200 మంది హాజరై బీపీ, షుగర్, ఇతర టెస్టులు చేయించుకున్నారు. ప్రోగ్రామ్ కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన రిటైర్డ్ఐఏఎస్ఆఫీసర్, ఫార్మర్చీఫ్సెక్రటరీ ఆఫ్ఏపీ, హోలీస్టిక్వెల్నెస్క్లినిక్ఫౌండర్ఎస్పీ టక్కర్మాట్లాడుతూ.. ఈ బిజీ కాలంలో ఎంతోమంది బీపీ, షుగర్వంటి వ్యాధులతో బాధపడుతున్నారని, కానీ చాలా మందికి ఆ విషయం తెలియడం లేదన్నారు. ఇలాంటి హెల్త్‌క్యాంప్‌లు పెట్టడం వల్ల వారికి ఉపయోగం ఉంటుందన్నారు. డాక్టర్లు అమృత వర్షిణి, కార్తీక్‌రెడ్డి, దేవదర్శిణి, అభినయ, స్వర్ణలక్ష్మి, వర్షిణి, షా ఫరీనా, స్కూల్కరస్పాండెంట్వెంకట్నారాయణ్, ఈవెంట్మేనేజర్రాధారాం, టీచర్లు ఫజల్ ఫాతిమా, సుజాత, ఫణిశ్రీ పాల్గొన్నారు.