
హైదరాబాద్, వెలుగు: లా డిగ్రీ చదివిన బీసీ స్టూడెంట్స్ కు మూడేండ్ల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు హైదరాబాద్ అడిషనల్కలెక్టర్ తెలిపారు. జూలై 4వతేదీలోపు దరఖాస్తులు పూర్తి చేసి కలెక్టరేట్లోని బీసీ వెల్ఫేర్ ఆఫీసులో అందజేయాలని సూచించారు. యూనివర్సిటీ గ్రాంట్స్కమిషన్నుంచి గుర్తింపుపొందిన కాలేజీ నుంచి లా కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండాలని పేర్కొన్నారు.
23 –35 ఏండ్లలోపు ఉండి.. కుటుంబ ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదన్నారు. అభ్యర్థి, కుటుంబ సభ్యులు గతంలో ఉచిత శిక్షణను పొంది ఉండకూడదని, బార్ కౌన్సిల్ లో నమోదు చేసుకొని ఉండాలని స్పష్టం చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అన్ని వివరాలతో పాటు పాస్ పోర్టు సైజ్ ఫొటో, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లను దరఖాస్తుకు జత చేసి జిల్లా బీసీ వెల్ఫేర్ఆఫీస్లో అందించాలని తెలిపారు.