రియాక్షన్స్ వస్తే ఇలా చేయండి

రియాక్షన్స్ వస్తే ఇలా చేయండి

వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి పది మందిలో ఒకరిద్దరికి వ్యాక్సిన్ వేసుకున్న చోట నొప్పి, దురద, వాపు, ఎర్రబారడం, అలసట, తలనొప్పి, జ్వరం వచ్చిన ఫీలింగ్ కలగడం, జాయింట్ పెయిన్స్‌‌‌‌, కండరాల నొప్పి, శరీరం వేడెక్కడం వంటి రియాక్షన్స్ కనిపిస్తాయి. వాటికి భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్లు అక్కడే ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తారు. కొంతమందికి మాత్రం ఇంజక్షన్ వేసిన దగ్గర గడ్డలు ఏర్పడటం, జ్వరం, వాంతులు, బాడీ టెంపరేచర్‌‌‌‌ బాగా పెరగడం, ముక్కు కారడం, దగ్గు, గొంతులో మంట వంటి రియాక్షన్స్ కూడా వచ్చే చాన్స్​ ఉంటుంది.

వంద మందిలో ఒకరికి మత్తెక్కడం, పొత్తి కడుపులో నొప్పి, ఆకలి తగ్గడం, విపరీతంగా చెమట రావడం, చర్మంపై ర్యాషెస్, తీవ్ర దురద వంటి సైడ్ ఎఫెక్ట్స్‌‌‌‌ కనిపించే అవకాశముంది. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలి. వెంటనే డాక్టర్‌‌‌‌‌‌‌‌కు తెలపాలి. ఇంటికి వెళ్లిన తర్వాత ఇలాంటి రియాక్షన్‌‌‌‌ వస్తే 104, 108 నంబర్లకు ఫోన్ చేసి చెప్పాలి. కాగా.. ప్రైవేట్ హాస్పిటళ్లలో వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లకు మైనర్ రియాక్షన్స్ వస్తే ఫ్రీగా ట్రీట్‌‌‌‌మెంట్ చేస్తారు. అదే మేజర్ రియాక్షన్స్‌‌‌‌ వస్తే ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్‌‌‌‌లో చేరి ఉచితంగా ట్రీట్‌‌‌‌మెంట్ తీసుకోవచ్చు.