
అది న్యూఢిల్లీ విజయ్ చౌక్ రిపబ్లిక్ డే రిహార్సల్ జరుగుతున్న ప్రదేశం. అందులో బ్యాండ్ బృందంతో 150 మంది కవాతు చేస్తున్నారు.. రిపబ్లిక్ డే సందర్భంగా రిహార్సల్ కామన్.. కొత్తేముంది అనుకుంటున్నారా.. ఉంది.. ఆ బృందం ఫ్రెంచి సైన్యం. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్ కోసం రిహార్సల్స్ చేస్తున్నారు. వీరితోపాటు ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్, స్పేస్ ఫోర్స్ కూడా 75 వ గణతంత్ర దినోత్సవ పరేడ్ కు ముందు దేశ రాజధాని కర్తవ్య మార్గ్ లో ఫ్లై పాస్ట్ రిహార్సల్స్ లో పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే పరేడ్ లో ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ రాఫెల్ ఫైటర్ జెట్ లు, మల్టీరోల్ ట్యాంకర్ ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాప్ట్ లు కూడా పాల్గొంటున్నారు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.అంతేకాదు భారత వైమానిక దళానికి చెందిన C-295 రవాణా విమానం ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ లో మొదటి సారి గా పాల్గొంటుందని IAF తెలిపింది. ఐఏఎఫ్ కి చెందిన మొత్తం 51 విమానాలు ఈ ఏడాది ప్లై పాస్ట్ లో పాల్గొంటాయని అధికారులు చెబుతున్నారు. 1971లో పాకిస్తాన్ పై విజయం సాధించిన ప్రసిద్ద టాంగైల్ ఎయిర్ డ్రాప్ ను ఈ దళం చిత్రీకరిస్తుందని IAF తెలిపింది.
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ను ఆహ్వానించారు ప్రధాని మోదీ. జనవరి 26న తాను భారత్ లో పర్యటిస్తున్నట్లు మాక్రాన్ కూడా ధృవీకరించారు. దేశరాజధాని లో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ ప్రధాని ముఖ్య అతిథిగా రావడం ఇది ఆరోసారి. 2023 జూలై జరిగిన ఫ్రాన్స్ బాస్టిల్ డే వేడుకలకు భారత ప్రధాని మోదీని ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ ఆహ్వానించింది. రక్షణ, భద్రత, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు , కొత్త టెక్నాలజీ లతో రెండు దేశాల సత్సంబంధాలు బలంగా ఉన్నాయనడానికి ఇది నిదర్శనం.
భారత్, ఫ్రాన్స్ ఇరు దేశాల ప్రయోజనాలకోసం ఆధునిక డిఫెన్స్ టెక్నాలజీ, పరస్పర అభివృద్ధి, ఉత్పత్తి సహకారంలో కట్టుబడి ఉన్నాయి. 2023 జూలై లో భారీత్ ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్(మెరైన్) జెట్ లను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. దీంతో స్వదేశీయంగా నిర్మించిన విమాన వాహక నౌక INS విక్రాంత్ బలోపేతం అయింది.
రిపబ్లిక్ డే రిహార్సల్స్
ఢిల్లీలో భారత దేశ 75వ గణతంత్ర దినోత్సవ కోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకోసం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను జనవరి 19 నుంచి జనవరి 26 వరకు వారం రోజుల పాటు ప్రతి రోజు 2 గంటల మూసేవేశారు. ఉదయం 10.20 గంటల నుంచి 12.45 గంటల మధ్యలో ఎటువంటి విమానాలు ఢిల్లీలో ఎగరకూడదు.
ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ పరేడ్ లో భారీత సైన్యం మేడ్ ఇన్ ఇండియా ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించబోతోంది. ఈ ఏడాది గతణతంత్ర దినోత్సవ వేడుకల్లో LCH ప్రచండ్ ఛాపర్, పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు, నాగ్ యాంటీ ట్యాంక్ క్షిఫణులు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. LCH ప్రచండ్ HAL చే రూపొందించబడిన తయారు చేయబడిన మొట్ట మొదటి మల్టీ రోల్ కంబాట్ హెలికాప్టర్.
వీటితోపాటు తేలిక పాటి యుద్ధ హెలికాప్టర్లు, భారత సైన్యం రుద్ర అని కూడా పిలువబడే ALH ధృవ్ ఛాపర్ల ఆయుధ వెర్షన్ కూడా ప్రదర్శిస్తారు. పరేడ్ లో ప్రదర్శించే ఆయుధ వ్యవస్థలో DRDO అభివృద్ధి చేసిన పినాకా, స్వాతి రాడార్లు కూడా ఉన్నాయి.