ఫ్రెంచ్ ఓపెన్ విజేత ఇగా స్వైటెక్

ఫ్రెంచ్ ఓపెన్ విజేత ఇగా స్వైటెక్

ఫ్రెంచ్ ఓపెన్ 2022 ఫైనల్లో  పోలెండ్‌‌ ‌ ప్లేయర్‌‌, వరల్డ్‌‌ నంబర్‌‌వన్‌‌ ఇగా స్వైటెక్‌ విజేతగా నిలిచింది. ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్లో అమెరికా యంగ్​స్టర్​ కొకోగాఫ్ పై 6-1, 6-3 స్కోరు తేడాతో విజయం సాధించింది. ఏక పక్షంగా సాగిన ఫైనల్లో గాఫ్ ఏ దశలోనూ స్వైటెక్కు పోటీ ఇవ్వలేకపోయింది. ఫస్ట్ సెట్లో ఒకే గేమ్లో గెలిచిన గాఫ్..రెండో సెట్లో కొద్దిగా పోరాడింది. అయితే స్వైటెక్ సూపర్ సర్వీసులతో గాఫ్ను భయపెట్టింది. స్వైటెక్ బలమైన షార్ట్లకు లకు సమాధానం చెప్పలేక ఓడిపోయింది. ఈ విజయంతో రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను ముద్దాడింది. 2020లోనూ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను స్వైటెక్ సాధించింది. అంతేకాదు స్వైటెక్ కు ఇది వరుసగా 35వ మ్యాచ్ విజయం. దీంతో 21వ శతాబ్దంలో అత్యధిక వరుస విజయాలు సాధించిన వీనస్ విలియమ్స్‌తో స్వైటెక్ సమంగా నిలిచి రికార్డు సృష్టించింది.