మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారి పోతున్నాయి.. ధనం మూలం ఇదంజగత్ అన్నట్లు, డబ్బు కోసం మనిషి ఎంత దిగజారుతాడో ఊహించడానికి కూడా వీలు లేకుండా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. కేరళలో జరిగిన ఈ ఘటన గురించి వింటే మానవత్వం చచ్చిపోయిందని నమ్మక తప్పదు.. కొబ్బరి చెట్టు మీద నుంచి కిందపడ్డ యువకుడిని ట్రీట్మెంట్ కి ఖర్చవుతుందని తన ఫ్రెండ్సే చంపేశారు. బెంగళూరు సౌత్ లోని మగాడి తాలూకా వాజరహళ్లి గ్రామంలో జరిగింది ఈ దారుణ ఘటన.
వాజరహళ్లికి చెందిన ముగ్గురు ఫ్రెండ్స్ వినోద్ కుమార్, సుదీప్, ప్రజ్వల్ కలిసి పార్టీ చేసుకుందామని కొబ్బరి తోటకు వెళ్లారు. అక్కడ మందులో కలుపుకునేందుకు కొబ్బరి బొండం కావాలని వినోద్ ని అడిగారు తన ఫ్రెండ్స్.. కొబ్బరి బొండం కోసం చెట్టు ఎక్కిన వినోద్ సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డాడు.అంత ఎత్తు నుంచి కిందపడ్డ వినోద్ నొప్పి భరించలేక కేకలు వేసాడు. దీంతో భయాందోళనకు గురైన అతని ఫ్రెండ్స్ వినోద్ ని ఇంటికి తీసుకెళ్లడం అనుకున్నారు.
అయితే.. ఇంటికి వెళ్లే దారిలో గ్రామస్థులు తమను నిలదీస్తారేమోనని భయపడ్డారు సుదీప్, ప్రజ్వల్. ట్రీట్మెంట్ కి లక్షల్లో ఖర్చవుతుందని... తామే భరించాల్సి వస్తుందేమోనని భయపడ్డారు. ట్రీట్మెంట్ ఖర్చు నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ వేశారు వినోద్ ఫ్రెండ్స్. వినోద్ ను వజరహళ్లి సమీపంలోని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో బావిలో పడేసారు తన ఫ్రెండ్స్.
వినోద్ మృతదేహాన్ని ను రాయితో కట్టేసి బావిలో పడేశారు:
వినోద్ మృతదేహాన్ని రాయితో కట్టేసి బావిలో పడేశారు సుదీప్ ప్రజ్వల్. వినోద్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని తాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బెంగళూరులో ఉంటున్న వినోద్ పేరెంట్స్ సిటీలో అతని కోసం వెతికారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించినా లాభం లేదు. ఘటన జరిగిన కొద్దిరోజుల తర్వాత బావిలో ఈతకు వెళ్లిన కొంతమంది యువకులు వినోద్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
►ALSO READ | 30 కోట్ల మందితో 12న భారత్ బంద్ : ఎందుకో తెలుసుకోండి..!
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు వినోద్ చివరిసారిగా కలిసిన తన ఫ్రెండ్స్ ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా..ట్రీట్మెంట్ ఖర్చు నుంచి తప్పించుకునేందుకు తామే వినోద్ ను చంపేసి బావిలో పడేశామని ఒప్పుకున్నారు. సుదీప్, ప్రజ్వల్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు పోలీసులు.
