అప్పట్లో అక్బర్.. ఇప్పుడు ప్రధాన్...ప్రజా నిరసనలతో రాజీనామాలు

అప్పట్లో అక్బర్.. ఇప్పుడు ప్రధాన్...ప్రజా నిరసనలతో రాజీనామాలు

న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రుల రాజీనామాలు చాలా అరుదుగా జరిగాయి. సాధారణంగా ఎంతటి పెద్ద వివాదాలు లేదా ఆరోపణలు ఎదురైనప్పటికీ, కేంద్ర మంత్రులు తప్పుకోలేదు. ప్రతిపక్షాలు ఎంతగా విమర్శలు గుప్పించినా రాజీనామాలు చేయలేదు. కానీ, 2018లో ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భిన్నంగా అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ మీటూ ఆరోపణల నేపథ్యంలో స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. 

ఆ ఘటన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు నీట్ పేపర్ లీక్ వివాదం, జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనకు తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.