పరీక్షా విధానం, నీట్ పేపర్ లీక్ వివాదం చుట్టూ దాదాపు మూడు నెలల పాటు సాగిన ఆందోళనల తదనంతరం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. మే ప్రారంభంలో నీట్‌పేపర్ లీక్‌పై మొదలైన నిరసన.. దేశంలోని పరీక్షా విధానంలో పారదర్శకత, జవాబుదారీతనం, సంస్కరణల కోసం డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. దేశంలో యువత చేపట్టిన అత్యంత సంచలనాత్మక ఉద్యమం సాగిందిలా..
- న్యూఢిల్లీ
మే 3: నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహణ. 22 లక్షల మంది హాజరు
మే 12: పేపర్ లీక్ ఆరోపణలతో పరీక్ష రద్దు
మే 15: సీజేఐ కాక్రోచ్ కామెంట్లతో దేశవ్యాప్తంగా కలకలం
మే 16: అభిజీత్ దీప్కే నేతృత్వంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) స్థాపన
జూన్ 2: పరీక్షల లీకేజీలపై ప్రధాన నగరాల్లో విద్యార్థుల నిరసనలు
జూన్ 6: సీజేపీ తరఫున ఢిల్లీలో నిరసనకు నాయకత్వం వహించేందుకు భారత్‌కు వచ్చిన అభిజీత్ దీప్కే. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
జూన్ 11: పరీక్షల సంస్కరణలు, విద్యార్థులకు పరిహారం అందించాలని డిమాండ్ సహా 5 పాయింట్లతో సీజేపీ మేనిఫెస్టో
జూన్ 20: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన ప్రారంభం
జూన్ 28: జంతర్ మంతర్ వద్ద సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష
జులై 9: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజున ‘పార్లమెంట్ మార్చ్’ చేపడతామని సీజేపీ ప్రకటన
జులై 16: సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పర్యవేక్షణ, ప్రాణ రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్న ఢిల్లీ హైకోర్టు
జులై 18: సోనమ్ వాంగ్‌చుక్‌ను జంతర్ మంతర్ నుంచి ఆసుపత్రికి తరలింపు
జులై 20: ‘చలో సంసద్’ పేరిట వేలాది మంది నిరసనకారుల పార్లమెంట్ మార్చ్.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
జులై 20: జేపీ నడ్డా నివాసంలో సీజేపీ ప్రతినిధులతో ప్రభుత్వం మొదటిదఫా చర్చలు
జులై 20: జులై 24: ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంట్ స్తంభన
జులై 21: ప్రధానమంత్రి నివాసం వెలుపల రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీల ధర్నా
జులై 23: పేపర్ లీక్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన
జులై 24: కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ లభించడంతో దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్
జులై 24: కేంద్రం-సీజేపీ మధ్య రెండో విడత చర్చలు. ప్రధాన్ రాజీనామాకు పట్టుబట్టిన విద్యార్థులు
జులై 25: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
