ఐడియా అదుర్స్.. ఊళ్ల నుంచి కోతులు పరార్

ఐడియా అదుర్స్.. ఊళ్ల నుంచి కోతులు పరార్

మ్యాన్‌ వర్సెస్‌ మంకీ’ ఫైట్‌ లోభాగంగా ప్రజా జీవితానికి నష్టం కలిగిస్తున్న వానరాల విషయంలోకఠినంగా వ్యవహరించాలని కేంద్రం అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కోతుల సంఖ్యను కట్టడి చేసేందుకు స్టెరి లైజేషన్(సంతానోత్పత్తి కలుగకుం డా శస్త్ర చి కిత్స)చేయాలనిసూచించింది. కానీ, ఆ నిర్ణయం వల్ల అనర్థా లు జరుగుతాయని నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యం లో ఒడిశాసర్కార్‌ వైవిధ్యం గా ఆలోచించింది.ఆరేషన్‌ ‘ఫ్రూట్‌ ప్లాంటేషన్ ’ పేరిట కోతుల్ని వెనక్కి రప్పించే ప్రయత్నం చేస్తోంది.

హైవేలపై దాడులు….

దీనంతటికి  పర్యావరణ  సమతుల్యత దెబ్బతినడం కారణం. అందుకే అడవుల్లో ఉండాల్సిన కోతులు ఊళ్లలోకి చొరబడుతున్నాయి. పంటలను పాడుచేయడమే కాకుం డా ఆహారం కోసం ఇళ్లలోకి దూరి జనాల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఒడిశా కలహండి జిల్లా లో ఈ పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. తిండి కోసం హైవేలో వెళ్తున్న వాహనాలపై కోతులు దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతోసమస్యకు ప్రత్యామ్నాయంగా అడవులను సృష్టించేందుకు నడుం బిగించింది ఒడిశా ప్రభుత్వం . చొరవ తీసుకుని పండ్ల చెట్లను కూడా పెం చబోతోంది.

 భారీగా ప్లాన్‌….

బిస్వం త్‌ పుర–కడలిఘాట్‌ మధ్య ఐదు కిలోమీటర్ల మేర మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. మొత్తం 350 ఎకరాల్లో ఐదు లక్షల మొక్కల్ని నాటనున్నారు. వాటిల్లో పండ్ల మొక్కలు లక్షన్నర ఉన్నాయి. ఉసిరి , బాదం,సీతాఫలం, పనస, జామ, మా మిడితో పాటు యాపిల్‌ చెట్లను ఇక్కడ పెంచబోతున్నారు. బిస్వంత్‌ పూర్‌ లో గతంలో 40 హెక్టార్ల విస్తీర్ణం లో పండ్ల చెట్లను పెం చారు. కోతుల్ని వెనక్కి రప్పించే ఆ ప్లాన్‌ సక్సెస్‌ అయ్యింది. దీంతోఇప్పుడు మరోసారి భారీగా ప్లాన్‌ చేయబోతున్నారు. ఇందుకోసం అయ్యే ఖర్చు మొత్తం ఒడిశా ప్రభుత్వం భరిస్తుం ది. జూలై కల్లా మొక్కలు నాటే ప్రక్రియ పూర్తి కానుంది.ఫ్రూట్‌ ప్లాం టేషన్‌ ఆపరేషన్‌ పై డివిజినల్‌ ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్‌ అశోకన్‌ స్పందిం చాడు.‘స్టేట్‌ ఫారెస్ట్‌‌‌‌ స్కీ మ్‌ ప్రకారం ప్రతి సంవత్సరం మొక్కల్ని నా టుతాం .అయితే ఈ ఏడాది కోతుల కోసం పండ్ల మొక్కల్ని పెద్ద మొత్తంలో పెం చాలని నిర్ణయించాం . కోతుల్ని దేవుడంటూ దారినపోయే కొందరు ఆహారాన్ని అందిస్తుం టారు. కానీ, గుం పులుగా అవి హైవేపై దాడులు చేస్తూ టూరిస్ట్‌‌‌‌లు, ట్రావెలర్లకు ఇబ్బం దులు కలిగిస్తున్నాయి. అందుకే ఎక్కడికక్కడ హెచ్చరికలతో బోర్డులు ఏర్పా టు చేశాం ’ అని ఆయన చెబుతున్నాడు. ఒడిశా ఫారెస్ట్‌‌‌‌ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో మనుషులుకోతులతో పాటు పర్యావరణానికి కూడా ఊరట అందిస్తుం దని అశోకన్‌ అంటున్నాడు .