పాలకు ఏ1, ఏ2 పేర్లు వద్దన్న ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ

పాలకు ఏ1, ఏ2 పేర్లు వద్దన్న ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ

న్యూఢిల్లీ:  పాలకు 'ఏ1',  'ఏ2'  క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తొలగించాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ గురువారం ఈ–-కామర్స్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో సహా కంపెనీలను ఆదేశించింది. ఇటువంటి లేబులింగ్ కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తోందని, ఇవి  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ) ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006కి అనుగుణంగా లేవని పేర్కొంది.

   ఈ-–కామర్స్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఈ క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి వెంటనే తొలగించాలని కూడా స్పష్టం చేసింది. ఇదివరకే ముద్రించిన లేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తొలగించేందుకు కంపెనీలకు ఆరు నెలల సమయం ఇచ్చింది.   ఏ1  ఏ2 పాలలో బీటా-కేసిన్ ప్రోటీన్​ వేర్వేరుగా ఉంటుంది. ఈ ఆర్డర్ విధించడానికి ప్రధాన కారణం ఈ రెండు పాల ప్రయోజనాలపై సరైన శాస్త్రీయ ఆధారాలు లేకపోవడమేనని అధికారులు తెలిపారు.