- మరోసారి ప్రజల నడ్డి విరిచేందుకు మోదీ సర్కారు ఏర్పాట్లు
న్యూఢిల్లీ: ప్రజలపై మరోసారి మోదీ సర్కారు ఇంధన ధరల భారం మోపనున్నది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను రూ.993కు పెంచిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు డొమెస్టిక్ వంటగ్యాస్ సిలిండర్ల ధరలను కూడా పెం చేందుకు సన్నద్ధమైంది. 5 లేదా 7 రోజుల్లో ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచేందుకు ఏర్పాట్లు చేస్తోం ది. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు రూ.4 నుంచి రూ.5, డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ.40 నుంచి రూ.50 పెంచవచ్చని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి.
అయితే పెట్రో ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచబోమని మోదీ సర్కారు ఇటీవలే ప్రకటించింది. బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ లో పోలింగ్ ముగిసిన వెంటనే కమర్షియల్ సిలిండర్ల ధరను భారీగా పెంచేసి దేశ ప్రజల నడ్డి విరిచింది. కాగా.. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడిందని, దీంతో పెట్రో ధరలతో పాటు డొమెస్టిక్ వం టగ్యాస్ సిలిండర్ల ధరలను పెంచక తప్పని పరిస్థితి నెలకొందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ధరల పెంపుపై ప్రభుత్వం చర్చలు జరుపుతున్నదని, రేట్లు పెంచితే ప్రజలపై పడే ప్రభావం గురించి ఆలోచి స్తున్నదని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇంధన కంపెనీలపైనా, ప్రజలపైనా భారం పడకుండా బ్యాలెన్స్ డ్ గా ధరలు పెంచడంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిపాయి.
