గద్వాల, వెలుగు: వానాకాలం పంటకు జూరాల ఆయకట్టు కింద పూర్తిస్థాయిలో సాగునీరు అందించనున్నట్లు జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. మంగళవారం జూరాల ప్రాజెక్టును సందర్శించి వరద నీరు, ఆయకట్టు వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుడి కాలువ కింద 1,02,000 ఎకరాలకు సాగునీరు అందజేస్తామని, చివరి ఆయకట్టు వరకు నీరందేలా కాలువల నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు.
వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని, వేసవి తాగునీటి సమస్య రాకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. ఈనెల 15 నాటికి సదరం బిల్డింగ్‌ను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎస్ ఈ కేశవరావు, డీఈ నాగేశ్వరరావు, ధరూర్ తహసీల్దార్ నందిని
ఉన్నారు.
