వెజ్‌తో కూడా మస్తు ప్రోటీన్స్

వెజ్‌తో కూడా మస్తు ప్రోటీన్స్

ప్యూర్ వెజిటేరియన్‌‌ అని తెలియగానే ‘అయ్యో నాన్‌‌వెజ్‌‌ తినవా? మరి ప్రొటీన్స్‌‌ ఎట్ల?’ అని అంటారు అందరూ. నాన్‌‌వెజ్‌‌లో ఉండే ప్రొటీన్స్‌‌ వెజిటేరియన్‌‌ ఫుడ్‌‌లో ఉండవని చాలామంది అపోహ కూడా. కానీ, అది నిజం కాదు. శాఖాహరంలో కూడా ప్రొటీన్స్‌‌ ఉంటాయి. అందుకే ఈ మధ్యకాలంలో ప్లాంట్‌‌ బేస్డ్‌‌ ప్రొటీన్‌‌ ప్రొడక్ట్స్‌‌కు మస్తు డిమాండ్‌‌ ఉంది. నట్స్‌‌, సీడ్స్‌‌లో ప్రొటీన్‌‌ ఎక్కువగా ఉంటుంది. కొన్ని కూరగాయల్లో మాత్రమే ప్రొటీన్స్‌‌ ఉండగా ఫ్రూట్స్‌‌లో అసలుండవు.

ప్లాంట్‌‌ బేస్డ్‌‌ ఫుడ్‌‌లో లో శాచ్యురేటెడ్‌‌ ఫ్యాట్‌‌ ఉంటుంది. కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువని చాలా సర్వేల్లో కూడా వెల్లడైంది.

ప్లాంట్‌‌ బేస్డ్‌‌ ఫుడ్‌‌లో శాచ్యురేటెడ్‌‌ ఫ్యాట్స్‌‌తో పాటు ఫైబర్‌‌‌‌ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు, వెయిట్‌‌ మెయింటెయిన్‌‌ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఫైబర్‌‌‌‌ ఎక్కువగా ఉండటం వల్ల చాలాసేపటి వరకు ఆకలి వేయదు.

వీగన్‌‌ డైట్‌‌ ఫాలో అయ్యేవాళ్లకు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం లేదని చాలా రీసెర్చ్‌‌లు చెప్తున్నాయి.

వీగన్‌‌ డైట్‌‌, ప్లాంట్‌‌ బేస్డ్‌‌ ప్రొటీన్‌‌ చాలా లైట్‌‌గా ఉంటాయి దీని వల్ల త్వరగా అరిగిపోతుంది. వాటిలో ఉండే ఫైబర్‌‌‌‌ వల్ల ఫుడ్‌‌ త్వరగా అరిగిపోతుంది.

ప్లాంట్‌‌ బేస్డ్‌‌ ప్రొటీన్‌‌లో తొమ్మిది ఎసెన్షియల్‌‌ అమైనో యాసిడ్స్‌‌ ఉంటాయి. దీనివల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్‌‌ అన్నీ సమపాళ్లలో అందుతాయి.

For More News..

రాష్ట్రంలో వందేళ్లు మన ప్రభుత్వమే ఉండాలని అమ్మ కోరిక

ఇంటి పనికి భార్యకు జీతమివ్వాల్సిందే.. కోర్టు సంచలన తీర్పు