వచ్చే రెండు నెలలు మస్తు వానలు

V6 Velugu Posted on Aug 03, 2021

  • ఐఎండీ అంచనా

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ నెల, వచ్చే నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని ఇండియా మెటియోరాలజికల్ డిపార్ట్ మెంట్ (ఐఎండీ) సోమవారం తెలిపింది. నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని ఐఎండీ పేర్కొంది. మిగతా రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం, అంత కంటే ఎక్కువ వర్షపాతం రికార్డయ్యే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని తెలిపింది. అయితే ఈ నెలలో మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహారాష్ట్ర, పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లడఖ్, హిమాచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం సాధారణం కంటే తక్కువ వానలు పడతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా వెల్లడించారు. కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీలోని రాయలసీమ, గోవా, సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఆగస్టు నుంచి సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం నార్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా (95 నుంచి 105 శాతం లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యావరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–-ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏ) ఉంటుందన్నారు. కాగా, ఈ ఏడాది నుంచి వానాకాల సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ప్రతి నెలా వర్షపాత అంచనా వివరాలను ఐఎండీ ప్రకటిస్తోంది.

Tagged Delhi, India, Heavy rains, Rains, IMD

Latest Videos

Subscribe Now

More News