రిలయన్స్‌‌‌‌తో మా డీల్‌‌‌‌ సరైందే

రిలయన్స్‌‌‌‌తో మా డీల్‌‌‌‌ సరైందే
  • కొన్ని డాక్యుమెంట్లు బయటపెట్టిన ఫ్యూచర్స్‌‌‌‌
  • డీల్‌‌‌‌కు ఓకే చెప్పాలంటూ సీసీఐకి లెటర్‌‌‌‌

న్యూఢిల్లీ: తమ కంపెనీలో వాటాల అమ్మకం కోసం రిలయన్స్‌‌‌‌ రిటైల్‌‌‌‌ వెంచర్‌‌‌‌తో తాము కుదుర్చుకున్న రూ.24,500 కోట్ల విలువైన ఒప్పందం సక్రమమేనని, ఈ విషయంలో అమెజాన్​ దురుద్దేశంతో ఆరోపణలు చేస్తోందని ఫ్యూచర్స్‌‌‌‌ రిటైల్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు ఆరోపించారు. తమ కంపెనీలో వాటాలో కొనే ఉద్దేశమే దానికి లేదని, కంపెనీ ఇంటర్నల్‌‌‌‌ కమ్యూనికేషన్‌‌‌‌ ఆధారంగా తమకు ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు. అమెజాన్‌‌‌‌–ఫ్యూచర్స్‌‌‌‌ కూపన్స్‌‌‌‌ డీల్‌‌‌‌కు సంబంధించి అమెజాన్‌‌‌‌ చాలాసార్లు మాట మార్చిందని ఆరోపించారు. రిలయన్స్‌‌‌‌తో తమ డీల్‌‌‌‌ను రద్దు చేయించడానికి అమెజాన్‌‌‌‌ ఒక్కోసారి ఒక్కోరకమైన ఇన్ఫర్మేషన్‌తో ఇచ్చిందని ఫ్యూచర్స్‌‌‌‌ స్పష్టం చేసింది. ఈ మేరకు 160 పేజీల డాక్యుమెంట్లను కాంపిటీషన్ కమిషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా (సీసీఐ)కు అందజేసింది. ఇందులోని వివరాలు ఇలా ఉన్నాయి.

ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ఎల్‌‌‌‌కు బదులు ఎఫ్‌‌‌‌సీపీఎల్‌‌‌‌..

ఫ్యూచర్స్‌‌‌‌ రిటైల్ లిమిటెడ్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ఎల్‌‌‌‌)లో ఫారిన్‌‌‌‌ పోర్ట్‌‌‌‌ఫోలియో ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ద్వారా 9.9 శాతం వాటాలు కొనాలని అనుకుంది. ఇందుకోసం 2018లో డీల్‌‌‌‌ కుదుర్చుకుంది. అయితే ఇండియా రిటైల్​ కంపెనీల్లో ఫారిన్‌‌‌‌ కంపెనీలు వాటాలు కొనడం సాధ్యం కాదని కేంద్ర  ప్రభుత్వం స్పష్టం చేయడంతో అమెజాన్‌‌‌‌ వెనక్కి మళ్లింది. ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ఎల్‌‌‌‌కు బదులు ప్రమోటర్‌‌‌‌ కంపెనీ  ఫ్యూచర్స్‌‌‌‌ కూపన్స్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌సీపీఎల్‌‌‌‌)లో 49 శాతం వాటాలు కొనాలని నిర్ణయించుకుంది. ఎఫ్‌‌‌‌సీపీఎల్‌‌‌‌కు ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ఎల్‌‌‌‌లోనూ 9.82 శాతం వాటా ఉంది. ఎఫ్‌‌‌‌సీపీఎల్‌‌‌‌లో వాటాలు కొనేందుకు అమెజాన్‌‌‌‌కు సీసీఐ నుంచి పర్మిషన్‌‌‌‌ వచ్చింది. తనకు ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ఎల్‌‌‌‌లో వాటాలు కొనేందుకు ఆసక్తి ఉందని అఫీషియల్​ డాక్యుమెంట్లలో ఎక్కడా పేర్కొనలేదు. ఇంటర్నల్‌‌‌‌ డాక్యుమెంట్లలో మాత్రం ఇందుకు విరుద్ధమైన సమాచారం కనిపించింది. ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ఎల్‌‌‌‌పై పట్టు సాధిస్తామని అందులో అమెజాన్‌‌‌‌ పేర్కొంది. ఈ డీల్‌‌‌‌ ఫెమా, ఎఫ్‌‌‌‌డీఐ చట్టాలకు విరుద్ధమని ఫ్యూచర్స్‌‌‌‌ గ్రూపు సీసీఐకి వివరించింది. దీనిపై అమెజాన్‌‌‌‌ ఇండియా అసిస్టెంట్‌‌‌‌ జనరల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ రాకేశ్‌‌‌‌ భక్షి మాట్లాడుతూ ఫారిన్‌‌‌‌ పోర్ట్‌‌‌‌ఫోలియో ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ద్వారా ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ఎల్‌‌‌‌ వాటాలు కొనడం సాధ్యం కాదని, అందుకే ‘ట్విన్ ఎంటిటీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌’ విధానాన్ని ఎంచుకున్నామని చెప్పారు. ఇదే విధానంలో ‘మోర్‌‌‌‌’ సూపర్‌‌‌‌మార్కెట్లలో వాటాలు కొన్నామని చెప్పారు. కాగా, ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ఎల్‌‌‌‌లో వాటాలు కొనే హక్కు తమకే ఉందంటూ అమెజాన్ వేసిన వాదనను సింగపూర్‌‌‌‌ ఆర్బిట్రేషన్‌‌‌‌ కోర్టుతోపాటు సుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే.