మార్కెట్ అప్‌‌‌‌.. కోటక్ బ్యాంక్ డౌన్‌‌‌‌

మార్కెట్ అప్‌‌‌‌.. కోటక్ బ్యాంక్ డౌన్‌‌‌‌
  • ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ బ్యాన్‌‌‌‌తో 10 శాతం క్రాష్​ అయిన బ్యాంక్ షేర్లు
  • 22,550 పైన నిఫ్టీ 

న్యూఢిల్లీ:  కొత్త కస్టమర్లను ఆన్‌‌‌‌లైన్ మార్గాల్లో  చేర్చుకోకుండా, కొత్తగా క్రెడిట్ కార్డులను ఇష్యూ చేయకుండా ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ బ్యాన్‌ చేయడంతో  కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం  ఇంట్రాడేలో 12 శాతం క్రాష్ అయ్యాయి.  చివరికి 11 శాతం నష్టంతో రూ.1,643 దగ్గర సెటిలయ్యాయి. కోటక్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్  ఈ ఒక్క సెషన్‌‌‌‌లోనే  రూ. 39,768 కోట్లు తగ్గి రూ.3,26,615 కోట్లకు పడింది. మరోవైపు క్యూ4 రిజల్ట్స్ మెప్పించడంతో యాక్సిస్ బ్యాంక్ షేర్లు గురువారం 6 శాతం  మేర ర్యాలీ చేశాయి. మార్కెట్ క్యాప్ విషయంలో  కోటక్ బ్యాంక్‌‌‌‌ను  దాటి నాలుగో ప్లేస్‌‌‌‌కు యాక్సిస్ బ్యాంక్ చేరుకుంది.

 ఎస్‌‌‌‌బీఐ, డాక్టర్ రెడ్డీస్‌‌‌‌, నెస్లే, హీరో మోటోకార్ప్ షేర్లు   పెరగడంతో వరుసగా ఐదో సెషన్ అయిన గురువారం కూడా బెంచ్​మార్క్ ఇండెక్స్‌‌‌‌లు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడే నష్టాల నుంచి రికవర్ అయ్యాయి. నిఫ్టీ 168 పాయింట్ల లాభంతో 22,570 దగ్గర సెటిలయ్యింది. సెన్సెక్స్‌‌‌‌ 487 పాయింట్లు పెరిగి 74,571 దగ్గర ముగిసింది. సెక్టార్ల పరంగా చూస్తే,  బీఎస్‌‌‌‌ఈ సర్వీసెస్‌‌‌‌, మెటల్‌‌‌‌, హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌, పవర్‌‌‌‌‌‌‌‌, ఎనర్జీ ఇండెక్స్‌‌‌‌లు ఎక్కువగా పెరిగాయి.  కన్జూమర్ డ్యూరబుల్స్‌‌‌‌, రియల్టీ ఇండెక్స్‌‌‌‌లు పడ్డాయి. 

తగ్గిన యూఎస్ జీడీపీ గ్రోత్‌ 

ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో యూఎస్ జీడీపీ అంచనాల కంటే తక్కువ వృద్ధి చెందింది.  యాన్యువల్ బేసిస్‌‌‌‌లో  మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 2.5 శాతం గ్రోత్ రేట్ నమోదు చేస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. కానీ, 1.6 శాతం మాత్రమే పెరిగింది. కిందటేడాది డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో యూఎస్‌‌‌‌ జీడీపీ గ్రోత్ రేట్ 3.4 శాతంగా నమోదయ్యింది. జీడీపీ గ్రోత్  రేట్ తక్కువగా నమోదుకావడం, ఇన్‌‌‌‌ఫ్లేషన్ పెరుగుతుండడంతో యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్‌‌‌‌ గురువారం ఐదేళ్ల గరిష్టమైన 4.706 శాతాన్ని టచ్‌‌‌‌ చేశాయి. యూఎస్ డౌజోన్స్‌ ఇండెక్స్ ఒకటిన్నర శాతం నష్టపోయింది.