చిన్నతనం నుంచే పిల్లల్ని ఆడ, మగ తేడా లేకుండా పెంచాలి: గడ్డం సరోజ వివేక్

చిన్నతనం నుంచే పిల్లల్ని ఆడ, మగ తేడా లేకుండా పెంచాలి: గడ్డం సరోజ వివేక్

చిన్నతనం నుంచే పిల్లల్ని ఆడ, మగ తేడా లేకుండా మంచి, చెడులు చెబుతూ పెంచాలని గడ్డం సరోజా వివేక్ అన్నారు. హైదరాబాద్ నారాయణ గూడలోని కేశవ్ మోమోరియల్ కాలేజ్ లో జరిగిన మహిళా శక్తి సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పూర్వకాలంలో ఇంట్లో ఆడపిల్లలకు తాత, నానమ్మలు చాలా కండిషన్స్ పెట్టేవారని, ప్రస్తుతం తల్లిదండ్రులు అమ్మాయిలను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని గడ్డం సరోజ అన్నారు. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే.. ఇల్లు సజావుగా నడుస్తుంది అనేది వాస్తవమని, వర్కింగ్ ఉమెన్స్.. ఇంటి పని.. ఆఫీస్ పని రెండింటిని సక్సెస్ ఫుల్ గా చేస్తున్నారు అంటే.. అది వారి సమర్థ్యనికి ఉదాహరణ అని మాట్లాడారు.  మహిళా శక్తి సమ్మేళనంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. 

ALSO READ :- పేద విద్యార్థులు క్రీడల్లో.. అంతర్జాతీయ వేదికల్లో సత్తా చాటేలా చేస్తాం: సరోజా వివేక్

మహిళలు ఒకరికొకరి సహకారం అందించుకుంటూ ఏ సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నైనా జైస్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాలాన్ని బట్టి మహిళలలు ఎన్నో  పాత్రలు పోషిస్తారని అందుకే భారత సంస్కృతిలో స్త్రీలకు ఎంతో గౌరవం ఉంటుందని మహిళల సేవలను నైనా జైస్వాల్ కొనియాడారు. నేను సాధించినది ప్రతి ఒక్కటి నా తల్లి దండ్రుల సాకారంతో సాధ్యమైందని ఆమె అన్నారు. స్త్రీలకు తెలిసింది చాలా తక్కువైనా.. వారికి తెలివి మగవారి కన్నా ఎక్కువ ఉంటుందని చెప్పుకొచ్చారు.