రైతు భరోసా నిధుల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్న వేళ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ట్వీట్ చేశారు. ఇవాళ (ఆదివారం మార్చి 22) సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా... అంటూ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు సీఎం రేవంత్. 70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. సిద్ధిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నాం.. అని నిధుల విడుదలకు సంబంధించి వివరాలు వెల్లడించారు.
అంతే కాకుండా ఫామ్ ఆయిల్ పరిశ్రమ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి గురించి చెప్పారు సీఎం. ఆర్ధిక సాయంతో చేతులు దులుపుకోవడం కాదు. కేవలం 17 నెలల వ్యవధిలో పామ్ ఆయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తి చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నాం. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తున్నాం.. అంటూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా. 70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. సిద్ధిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు…
— Revanth Reddy (@revanth_anumula) March 22, 2026
