ద్రాక్ష పండ్లపై కెమికల్స్, బ్యాక్టీరియా.. తినే ముందు ఇలా శుభ్రం చేస్తే అన్నీ మటాష్..

 ద్రాక్ష పండ్లపై కెమికల్స్, బ్యాక్టీరియా.. తినే ముందు ఇలా శుభ్రం చేస్తే అన్నీ మటాష్..

ద్రాక్ష పండ్లను మార్కెట్ నుండి తెచ్చినప్పుడు పైకి అవి మెరుస్తూ, ఫ్రెష్ గా కనిపిస్తాయి కానీ, వాటిపై పురుగుమందుల కెమికల్స్, దుమ్ము, కంటికి కనిపించని బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ద్రాక్ష పండ్లు చుడానికి తాజగా అనిపించినా వాటిని ఇంట్లో సహజంగా శుభ్రం చేశాకే తినడం మంచిది. ఇలా చేయడం వల్ల అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు. ద్రాక్ష పండ్లను  మీ ఇంట్లోనే చాల సింపుల్ గా ఎలా శుభ్రం  చేసుకోవాలంటే....

ద్రాక్ష పండ్ల తొక్క చాలా పల్చగా ఉండటం వల్ల రసాయనాలు వాటికి త్వరగా అంటుకుంటాయి. కేవలం నీళ్లతో కడిగితే అవి పూర్తిగా పోవు. కాబట్టి ఈ పద్ధతులు పాటించండి:

1: పారుతున్న నీటి కింద కడగడం
ముందుగా ద్రాక్ష పండ్ల గుత్తులను ఇంట్లో ట్యాప్ కింద పారుతున్న నీటిలో 20-30 సెకన్ల పాటు ఉంచండి. చేతులతో మెల్లగా రుద్దుతూ కడగడం వల్ల పైన ఉన్న దుమ్ము, మట్టి వదిలిపోతాయి. 

 2: బేకింగ్ సోడాతో నానబెట్టడం
శాస్త్రీయంగా ఇలా చేయడం  అత్యంత ఉత్తమమైన పద్ధతి. బేకింగ్ సోడా పురుగుమందుల ప్రభావాన్ని తొలగిస్తుంది. ఇందుకు ఒక లీటరు నీటిలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి కలపండి. అందులో ద్రాక్ష పండ్లను 10-15 నిమిషాల పాటు నానబెట్టండి. తర్వాత తీసి మళ్ళీ మంచి నీటితో కడిగేయండి.

 3: వెనిగర్ ఉపయోగించడం ద్వారా 
బ్యాక్టీరియా ఇతర క్రిములను చంపడానికి వెనిగర్ బాగా పనిచేస్తుంది. ఇందుకు మూడు వంతుల నీటికి ఒక వంతు వెనిగర్ కలిపి, అందులో ద్రాక్ష పండ్లను 5-10 నిమిషాలు ఉంచండి. దీనివల్ల పండ్లు క్రిమిరహితం అవుతాయి. వెనిగర్ వాసన వస్తుందని కంగారు పడకండి, మంచిగా నీటితో కడిగిన తర్వాత ఆ వాసన ఉండదు.

►ALSO READ | కొబ్బరి నీళ్లు vs నిమ్మరసం: ఎండాకాలంలో మీ శరీరానికి ఏది బెస్ట్ ?

 4: మెల్లగా రుద్ది ఆరబెట్టడం
ద్రాక్ష పండ్లను నానబెట్టిన తర్వాత ప్రతి గుత్తిని మెల్లగా చేత్తో లేదా మెత్తటి గుడ్డతో రుద్దండి. దీనివల్ల మిగిలిపోయిన రసాయనాలు కూడా పోతాయి. కడిగిన వెంటనే తడి లేకుండా ఆరబెడితే పండ్లు ఎక్కువ కాలం ఉంటాయి.

 5: ఫ్రిజ్‌లో  ఉంచడం 
పండ్లను శుభ్రం చేసిన తర్వాత గాలి ఆడే డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. తినే ముందు మాత్రమే కడుక్కోవడం ఇంకా మంచిది, ఎందుకంటే తడి వల్ల పండ్లు త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉంటుంది.  ద్రాక్ష పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు ఎన్నో ఉంటాయి. కాబట్టి తినడం మానేయకండి, కానీ తినే ముందు ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోండి. కేవలం 15 నిమిషాల సమయం కేటాయిస్తే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.