వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి కొబ్బరి నీళ్లు, నిమ్మరసం రెండూ అమృతంతో సమానం. అయితే వీటిలో ఏది ఎప్పుడు తాగాలో, దేని వల్ల ఎలాంటి లాభం ఉంటుందో మీకు తెలుసా....
ఎండలు ముదురుతున్నప్పుడు మన ఒంట్లో నీటి శాతం తగ్గిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ద్రవపదార్థాలు తాగడం వల్ల చెమట రూపంలో పోయిన నీటిని తిరిగి పొందవచ్చు. మరి కొబ్బరి నీళ్లు, నిమ్మరసంలో ఏది బెస్ట్ చూద్దామా.....
1. కొబ్బరి నీళ్లు
ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం ఇంకా కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కండరాలు సరిగ్గా పనిచేయడానికి, అలసట రాకుండా ఉండటానికి సహాయపడతాయి. ఎండలో తిరిగి బాగా నీరసించిపోయినప్పుడు కొబ్బరి నీళ్లు తాగితే వెంటనే శక్తి వస్తుంది. కొబ్బరి నీళ్లు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగాలంటే మీరు ఎండలో ఎక్కువ సేపు పని చేసినా లేదా వ్యాయామం చేసినా కొబ్బరి నీళ్లు తాగడం ఉత్తమం.
2. నిమ్మరసం
ఇందులో విటమిన్-సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎండ వల్ల చర్మం పాడవ్వకుండా కాపాడుతుంది. నిమ్మరసం తిన్న ఆహారం అరగడానికి, ఎసిడిటీ తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మరసం చాలా మంచిది. ఎప్పుడు తాగాలంటే భోజనం తర్వాత లేదా రోజంతా రిఫ్రెషింగ్‌గా ఉండాలనుకుంటే నిమ్మరసం బెస్ట్.
కొబ్బరి నీళ్లు vs నిమ్మరసం.. ఏది తీసుకోవాలి
చివరిగా చెప్పాలంటే.. ఈ రెండూ వేసవికి మంచివే. కానీ మీ అవసరాన్ని బట్టి తీసుకోవడం బెస్ట్. మీరు బాగా అలసిపోయి, చెమట పట్టే పని చేసినట్లయితే.. ఒంట్లో ఖనిజ లవణాల (Electrolytes) కోసం కొబ్బరి నీళ్లు తాగండి. మీరు రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ, చర్మం తాజాగా ఉండాలనుకుంటే.. తక్కువ ఖర్చులో దొరికే నిమ్మరసం తీసుకోండి.
శరీరానికి నీటిని అందించడంలో ఏది బెస్ట్ అంటే వేసవిలో శరీరానికి నీటిని అందించే విషయంలో కొబ్బరి నీరు ఇంకా నిమ్మరసం రెండూ ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తాయి.
►ALSO READ | Kitchen Telangana : ఎండి చేపలు.. పచ్చి కూరగాయల కూర.. సూపర్ టేస్ట్.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు..
