Kitchen Telangana : ఎండి చేపలు.. పచ్చి కూరగాయల కూర.. సూపర్ టేస్ట్.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు..

Kitchen Telangana : ఎండి చేపలు.. పచ్చి కూరగాయల కూర.. సూపర్ టేస్ట్.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు..

 ఇప్పటివరకు ఫిష్​ ప్రియులు చేపల కూర.. చేపల పులుసు  .. వంటివి మాత్రమే తిని ఉంటారు..  కాని ఎండు చేపలను పచ్చి కూరగాయలతో  వండుకొని ఒకసారి తిన్నారా.. ఇంటికి నలుగురు వస్తే చాలు దాన్నే చేసి పెడతారు.  అయితే మరో విషయం గుర్తు పెట్టుకోండి.. సమయం దొరికినా.. హాలిడే అయినా.. ఎండు చేపలు.. పచ్చి చేపల కూర కోసం మళ్లీ మీ ఇంటికి వస్తారు..అంత టేస్టీగా ఉంటే నాన్​ వెజిటబుల్​ విత్​ కూరగాయల కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . .
 
ఎండిచేపలు.. పచ్చి కూరగాయల కూర తయారీకి కావలసినవి

 

  • వంకాయ ముక్కలు : ఒక కప్పు 
  • బంగాళదుంపల ముక్కలు : ఒక కప్పు
  •  పచ్చి మామిడి ముక్కలు : అరకప్పు
  • ఎండు చేపలు :  150 గ్రాముల 
  •  ధనియాల పొడి, మసాలా పొడి: చిటికెడ్
  • ఉప్పు: కొద్దిగా 
  • కారం : కొద్దిగా
  •  నూనె: సరిపడ 
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ : సరిపడ
  • కొత్తిమీర : రెండు రెమ్మలు
  • ఉల్లిపాయ ముక్కలు : అరకకప్పు ( సన్నగా తరిగినవి)
  • పోపు గింజలు : రెండు టీస్పూన్లు
  • చింతపండు పులుసు: ఒక కప్పు ( అన్ని రకాల ముక్కలనుబట్టి)

ఎండిచేపలు.. పచ్చి కూరగాయల కూర తయారీ విధానం 


ఎండు చేపలను శుభ్రంగా కడిగి వేడి నీటిలో  15 నిమిషాలు నానబెట్టాలి.  ఆ తరువాత వాటిని మళ్లీ చల్లని నీటిలో ఐదు సార్లు కడగాలి.

స్టవ్​ పై పాన్​ పెట్టి ఆయిల్​ వేసి  కొద్దిగా వేడెక్కిన తరువాత పోపు గింజలు.. ఉల్లిపాయ ముక్కలు. . పచ్చి మిర్చి ముక్కలు వేసి బాగా వేగించాలి. 

ఆ తరువాత ఎండి చేపలను  ఈ మిశ్రమంలో వేసి చింతపండు పులుసు తో వెజిటబుల్స్​ను ఉడికించాలి

ఇప్పుడు  మసాలా పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి దించేయండి. అంతే, వేడి వేడి పచ్చి కూరగాయలు ఎండు చేపలు రెడీ.  ఇది  వేడి వేడి అన్నంలో తిన్నారంటే మళ్లీ మళ్లీ తింటారు..