హైదరాబాద్: నార్సింగి ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిరేవుల వ్యాస్ నగర్ సమీపంలో కారు, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో ఓఆర్ఆర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగంగా నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
►ALSO READ | పంజాగుట్టలో విషాదం.. బాల్కనీ స్లాబ్ కూలి ఇద్దరు మృతి
