పంజాగుట్ట పీఎస్ పరిధిలో విషాదం నెలకొంది. కుందన్ బాగ్ లోని అపార్టుమెంట్ లో మూడో అంతస్తు కూలి ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..
పంజాగుట్టలో పీఎస్ పరిధిలోని కుందన్ బాగ్ లోని శ్రీవాత్స అపార్టుమెంట్ లో ఆదివారం(మార్చి22) ఈ ప్రమాదం జరిగింది. రాడ్డు ఎక్స్ టెన్షన్ తో చేసిన భవనం మూడో అంతస్తు బాల్కనీ కూలింది. ఈ ప్రమాదంలో వర్కర్లు దేవదాస్, వివేక్ చనిపోగా యజమాని ద్వారక ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు.
ఎలక్ట్రీషియన్ పనికోసం వచ్చిన వర్కర్లు తండ్రీకొడుకులు దేవదాస్, వివేక్ లు.. మూడో అంతస్తు బాల్కనీలో యజమాని ద్వారకా ప్రసాద్ తో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వారు ఒక్కసారిగా కిందపడిపోయారు. దేవదాస్, వివేక్ లు స్పాట్ లోనే చనిపోగా యజమాని ద్వారకా ప్రసాద్ కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ద్వారకా ప్రసాద్ ను ఆస్పత్రికి తరలించారు.
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి వచ్చిన పంజాగుట్ట పోలీసులు ప్రమాదం జరిగినతీరును ఆరా తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
