SRH Practice Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 రణరంగం స్టార్ట్ కావడానికి మరో వారం రోజులే సమయం ఉంది. మార్చి 28వ తేదీన గ్రాండ్ గా ప్రారంభం కానున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం అన్ని జట్లు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తమ సొంత గడ్డపై ప్రాక్టీస్ మ్యాచులతో చెలరేగిపోతుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపించారు. ఎస్‌ఆర్‌హెచ్–-A, ఎస్‌ఆర్‌హెచ్–-B జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో బౌలర్లకు చుక్కలు చూపించారు. విధ్వంసకర బ్యాటింగ్ తో సన్ రైజర్స్ ఈసారి ట్రోఫీ గెలిచేలా కనిపిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో జరిగిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్–-ఏ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ నుంచే బౌలర్లపై విరుచుకుపడటంతో.. జస్ట్ 42 బంతుల్లోనే 94 రన్స్ చేసి సెంచరీని జస్ట్ మిస్ చేసుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ (49), సలీల్ అరోరా (47) రాణించడంతో ఆ జట్టు కేవలం 21 ఓవర్లలో 253 పరుగులు చేసింది. బౌలింగ్‌లో జయదేవ్ ఉనద్కత్ 5 వికెట్లు పడగొట్టాడు.
మరోవైపు స్‌ఆర్‌హెచ్–-B బ్యాటర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి ఏకంగా 282 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ కేవలం 25 బంతుల్లోనే 72 రన్స్ తో తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. సలీల్ అరోరా రెండు జట్ల తరపున బ్యాటింగ్ చేసి, ఈసారి 26 బంతుల్లో 56 పరుగులు బాదాడు. హర్ష దూబే చివర్లో 14 బంతుల్లో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. బౌలింగ్‌లో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీసుకున్నప్పటికీ భారీగా పరుగులు ఇచ్చాడు.
►ALSO READ | Virat Kohli: ప్రతి మ్యాచ్ తర్వాత లండన్ వెళ్లేందుకు చార్టర్ ఫ్లైట్ కావాలి.. విరాట్ కోహ్లీ పోస్ట్ వైరల్
ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పోటీ పడనుంది. ఈ సీజన్ లోని పలు మ్యాచులకు సన్‌రైజర్స్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇషాన్ ఆధ్వర్యంలోనే ఈసారి ఎస్‌ఆర్‌హెచ్ బరిలోకి దిగబోతుంది. కాగా 2024లో ఫైనల్ వరకు వెళ్లి టైటిల్ చేజార్చుకున్న సన్‌రైజర్స్, ఈసారి ప్రాక్టీస్ మ్యాచుల్లోనే 250+కి పైగా స్కోర్లు చేస్తుండటం చూస్తుంటే ఐపీఎల్ లోని ఇతర జట్లకు గట్టి హెచ్చరికలు పంపినట్లు అవుతుంది. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ లాంటి పవర్‌ఫుల్ హిట్టర్లకి ఇషాన్ కిషన్ జత కలవడంతో జట్టుకు ప్లస్ అయింది. కానీ బౌలింగ్ లో మాత్రం ఎస్‌ఆర్‌హెచ్ జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తుంది.
