Virat Kohli: ప్రతి మ్యాచ్ తర్వాత లండన్‌ వెళ్లేందుకు చార్టర్ ఫ్లైట్ కావాలి.. విరాట్ కోహ్లీ పోస్ట్ వైరల్

Virat Kohli: ప్రతి మ్యాచ్ తర్వాత లండన్‌ వెళ్లేందుకు చార్టర్ ఫ్లైట్ కావాలి.. విరాట్ కోహ్లీ పోస్ట్ వైరల్

Virat Kohli: మరో వారం రోజుల్లో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్,  ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2026 ఐపీఎల్ సీజన్ మధ్యలో కోహ్లీ లండన్– భారత్ మధ్య ప్రయాణించడానికి ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ను ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ కావాలని అడిగారనే వార్త నెట్టింట ప్రచారం అవుతుంది. దీనిపై ఈ ప్రచారానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ కోహ్లీ తనపై జరుగుతున్న ప్రచారానికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

కాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై విరాట్ కోహ్లీ రియాక్ట్ అయ్యాడు. తనపై జరుగుతున్న ఆ వార్త ఉన్న పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. రెండు నవ్వుతున్న ఎమోజీలను జోడించాడు. దీంతో ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అవి కేవలం హాస్యాస్పదమైనవని తేల్చి చెప్పారు. అయితే గత రెండేళ్లుగా కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్ లతో కలిసి లండన్‌లో స్థిరపడ్డారు. అందుకే ఈ చార్టర్ ఫ్లైట్ పుకార్లు నెట్టింట షికారు చేస్తున్నాయి. ఇక ఐపీఎల్ 2026 కోసం కోహ్లీ గత వారమే భారత్‌కు చేరుకున్నారు. ఇప్పటికే ఆర్సీబీ క్యాంప్‌లో చేరి నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగబోతోంది. మార్చి 28వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్‌తో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.  

►ALSO READ | SRH: బ్యాటింగ్లో అదుర్స్.. బౌలింగ్లో బెదుర్స్.. SRHపై CSK మాజీ ప్లేయర్ హాట్ కామెంట్స్

విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో కేవలం ఒకే ఫ్రాంచైజీ కోసం గత 19 సీజన్ల పాటు ఆడిన ఏకైక ప్లేయర్ గా నిలిచాడు. 2008లో ప్రారంభమైన సీజన్‌లో అండర్-19 డ్రాఫ్ట్ ద్వారా ఆర్సీబీలో చేరిన కోహ్లీ, 2011, 2014, 2018, 2022, 2025 మెగా ఆక్షన్స్‌లో అతడిని ఫ్రాంచైజీ తిరిగి రిటైన్ చేసుకుంది. 37 ఏళ్ల విరాట్ కోహ్లీ IPLలో ఇప్పటికీ యాక్టివ్ ఉన్న ఏకైక ఆటగాడు, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వేలంలోకి రాలేదు.