టెహ్రాన్: 48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవకపోతే.. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఒక వేళ అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తే.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలపై ఇరాన్ ప్రతీ దాడులు చేస్తోందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ట్రంప్ హెచ్చరికలపై రియాక్ట్ అయ్యింది.
‘‘ఇరాన్‌పై అమెరికా దాడులకు పాల్పడితే.. గల్ఫ్ అంతటా అమెరికా దాని మిత్రదేశాల మౌలిక సదుపాయాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. ట్రంప్ తన హెచ్చరికను అమలు చేస్తే అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాల్లోని ఇంధన కేంద్రాలు ఇరాన్ చట్టబద్ధమైన లక్ష్యాలుగా మారతాయి. అలాగే, హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తాం. అమెరికా దాడులకు ప్రతిస్పందించడానికి పూర్తి సిద్ధంగా ఉన్నాం’’ అని ఐఆర్జీసీ హెచ్చరించింది.
ఇరాన్‌కు ట్రంప్ డెడ్ లైన్ 48 గంటలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని 48 గంట ల్లోగా తెరవాల్సిందేనని డెడ్లైన్ విధించారు. లేదంటే ఇరాన్లోని అతిపెద్ద పవర్ ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు.
'ఇప్పటి నుంచి సరిగ్గా 48 గంటల్లోగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయాలి. ఈ క్రమంలో ఎలాంటి కండీషన్స్, బెదిరింపులకు పాల్పడకూడదు. దాన్ని పూర్తిగా తె రవకుంటే.. ఇరాన్లోని పవర్ ప్లాంట్లను అమెరికా లక్ష్యంగా చేసుకుంటుంది. వాటిని పూర్తిగా నాశసం చేస్తం. ముందుగా.. అన్నింటికంటే అతిపెద్ద విద్యుత్ కేంద్రంతో ఈ దాడులు ఆరంభించాల్సి వస్తుంది' అని ట్రంప్ హెచ్చరించారు.
►ALSO READ | నడి సముద్రంలో కుప్పకూలిన ఖతార్ ఆర్మీ హెలికాప్టర్.. ఆరుగురు మృతి
అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీ లకమైన హర్మూజ్ను ఇరాన్ మూసివేసింది. దీంతో చాలా దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. ఈ క్రమంలోనే ట్రంప్ తాజా హెచ్చరికలు చేశారు. కాగా ఇప్పటికే ఇరాన్ అణుకేంద్రం సమీపంలో మిస్సైల్ దాడులు జరిగిన నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన ఈ 'అల్టి మేటం' హాట్ టాపిక్‌గా మారింది.
