భారత్‌లో పాకిస్థాన్ మాజీ హైకమిషనర్‌గా పనిచేసిన అబ్దుల్ బాసిత్ మరోసారి భారత్‌పై విషం కురిపించారు. ఒకవేళ అమెరికా పాకిస్థాన్‌పై దాడి చేస్తే, మేము ప్రతికారంగా భారత్‌లోని ఢిల్లీ, ముంబై నగరాలపై బాంబులు వేస్తామంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఏమన్నారంటే...
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడులను ఉదాహరణగా సూచిస్తూ బాసిత్ మాట్లాడుతూ... ఒకవేళ అమెరికా పాకిస్థాన్‌లోని అణ్వాయుధాలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తే.. మేము అమెరికాపై, ఇజ్రాయెల్‌పై నేరుగా దాడి చేయలేకపోవచ్చు. కానీ మాకు మిగిలిన ఏకైక మార్గం భారతదేశమే. భారత్‌కు ఈ గొడవతో సంబంధం లేకపోయినా, మేము ముంబై, ఢిల్లీని టార్గెట్ చేస్తాం" అని చెప్పుకొచ్చారు.
పాకిస్థానీలంతా జిహాదీలేనట
అంతేకాకుండా, పాకిస్థాన్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ, వారు చదువుకున్నా.. చదువుకోలేకపోయినా, ధనికులైనా, పేదవారైనా అందరూ 'జిహాదీలే' అని ఆయన అన్నారు.
అమెరికా నిఘా రిపోర్ట్ ఏం చెబుతోంది
బాసిత్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందే, అమెరికా నిఘా సంస్థలు పాకిస్థాన్‌ను ఒక పెద్ద ముప్పుగా గుర్తించాయి. 2026 వార్షిక నివేదిక ప్రకారం.. పాకిస్థాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకుంటోందని, ఇది ప్రపంచ శాంతికి ప్రమాదకరమని అమెరికా హెచ్చరించింది. ముఖ్యంగా పాకిస్థాన్ తయారు చేస్తున్న క్షిపణులు (Missiles) భవిష్యత్తులో అమెరికాను కూడా చేరుకోగలవని, అక్కడి ఉగ్రవాద ముప్పు ఇంకా తగ్గలేదని అమెరికా నిఘా వర్గాల అధిపతి తులసి గబ్బార్డ్ తన రిపోర్టులో పేర్కొన్నారు.
