Xలో కొత్తఫీచర్.. పెద్ద ఆర్టికల్స్ ను బుల్లెట్ పాయింట్లుగా చదివేయొచ్చు

Xలో  కొత్తఫీచర్.. పెద్ద ఆర్టికల్స్ ను బుల్లెట్ పాయింట్లుగా చదివేయొచ్చు

ప్రముఖ సోషల్ మీడియాలో ప్లాట్ ఫాంలో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చారు ఎలాన్ మస్క్. AI ఆర్టికల్ సమ్మరీస్ పేరుతో ఈ కొత్త ఫీచర్ ను X ప్లాట్ ఫాంలో జోడించారు. ఫ్లాట్ ఫాంలోని పెద్ద కంటెంట్ నుంచి త్వరితగతిన ముఖ్యాంశాలను తెలుసుకోవాలనుకునే వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగ పడుతుంది. మొత్తం కంటెంట్‌ను చదవడానికి బదులుగా, కేవలం దాని సారాంశాన్ని మాత్రమే చదవడానికి ఇష్టపడే వారైతే, ఈ ఫీచర్ సమయాన్ని ఆదా చేస్తుంది.

AI ఆర్టికల్ సమ్మరీస్ (AI ఆధారిత సారాంశం) అనే ఈ ఫీచర్ ద్వారా, యూజర్లు  ఒక పెద్ద ఆర్టికల్‌ను గుర్తించి మొత్తం కంటెంట్‌ను చదవడానికి ఇష్టపడకపోతే  Summarise బటన్ ను నొక్కితే అది తక్షణమే మొత్తం కంటెంట్‌ను ముఖ్యమైన అంశాలతో కూడిన బుల్లెట్ పాయింట్లుగా మార్చి ఇస్తుంది. 

 X లోని AI ఆర్టికల్ సమ్మరీస్ ఫీచర్ ఎక్కువగా బుల్లెట్ పాయింట్ల రూపంలో సారాంశాన్ని అందిస్తుంది. దీంతో మొత్తం కథనాన్ని సులభంగా ,మరింత సరళమైన పద్ధతిలో రీడర్లు అర్థం చేసుకోగలుగుతారు. ఎక్కువ మేసేజ్ లు ఉండి పెద్ద కంటెంట్లు ఉన్నపుడు త్వరగా పని పూర్తి చేయాలనుకుంటే ఇది చాలా అనువైనది.

X లో మరో కొత్త  లిజన్.. 

ఈ ఫీచర్ తోపాటు గ్రోక్ AI వాయిస్ టెక్నాలజీని ఉపయోగించి X లిజన్ ఫీచర్‌ను కూడా జోడించింది. ఈ ఫీచర్  మీ ఫీడ్‌ను స్క్రోల్ చేస్తున్నప్పుడు లేదా మరేదైనా పని చేస్తున్నప్పుడు స్టోరీలను బిగ్గరగా వినడం ద్వారా మల్టీటాస్క్ చేయడానికి వీలు కల్పిస్తుంది. 

►ALSO READ | అమెజాన్ స్ప్రింగ్ సేల్.. ఫ్యాషన్ ప్రొడక్టులపై ఆఫర్లు

గత కొన్ని నెలల్లో ప్లాట్‌ఫారమ్‌పై ఆర్టికల్ ఎంగేజ్‌మెంట్ 18 రెట్ల వరకు పెరిగిందని X పేర్కొంది. ప్రస్తుతం ఈ AI ఫీచర్లు ప్రీమియం ,ప్రీమియం ప్లస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో ప్రీమియంకు నెలకు రూ. 427, ప్రీమియం ప్లస్‌కు రూ. 2వేల570 ఖర్చవుతుంది. ఆఫర్ లో మొదటి రెండు నెలల ధరలను సగానికి తగ్గిస్తోంది X  ప్లాట్ ఫాం.