న్యూఢిల్లీ: అమెజాన్ స్ప్రింగ్ సేల్షాపింగ్ ఆఫర్లను ప్రకటించింది. నైకీ, రేమండ్, లేవీస్ వంటి ప్రముఖ బ్రాండ్లపై 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. నైకీ, రేర్ ర్యాబిట్, ద సోల్డ్ స్టోర్, రే-బ్యాన్, రేమండ్, లెన్, స్కార్ట్, గెస్, సస్సాఫ్రాస్, టోక్యో టాకీస్, గ్యాప్,లివైస్, స్కెచెర్స్, ప్యూమా, మినిమలిస్ట్ వంటి బ్రాండ్ల ప్రొడక్టులపై ఆఫర్లు ఉన్నాయని తెలిపింది.
చాలా ప్రొడక్టులపై 50 శాతం వరకు తగ్గింపుతో పాటు ప్రత్యేకమైన కూపన్లతో 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది. ఏఐ షాపింగ్ అసిస్టెంట్ రూఫస్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన దుస్తులను, బ్యూటీ ప్రొడక్టులను సులభంగా వెతకవచ్చు, ఫొటోను అప్‌లోడ్ చేసి అచ్చం అలాంటి ఉత్పత్తులనే గుర్తించవచ్చని అమెజాన్ వివరించింది.
