వారఫలాలు :  మార్చి22నుంచి 28 వరకు.. ఏరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..! 

వారఫలాలు :  మార్చి22నుంచి 28 వరకు.. ఏరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..! 

వారఫలాలు ( మార్చి 22–28 ): జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..   ఈ వారం 12 రాశుల వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. . .!

మేషరాశి: ఈ వారం ఈ రాశి వారికి  మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులు ఈ వారం చాలా ప్రశాంతంగా ఉంటారు. ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఏర్పడుతాయి. చేతి వృత్తుల వారికి కొత్త ఆర్డర్లు వస్తాయి.వ్యాపారస్తులకు లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి.  అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గతంలో ఆపేసిన పనులు తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. 
 
వృషభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం అన్ని పనలు అనుకూలంగా సాగిపోతాయి.వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు పరిచయం కావడంతో.. లావాదేవీలు చాలా ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది.తోటి ఉద్యోగస్తులతో సంబంధాలు మెరుగుపడతాయి. నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు.పెళ్లి ప్రయత్నాలు కలసి వస్తాయి. 

మిధున రాశి: ఈ వారం ఈ రాశి వారికి కొత్త పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారలావాదేవీలు ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. ఆర్థికంగా  అనూహ్యమైన లాభాలను అందుకుంటారు. కొన్ని మొండి బాకీలు వసూలవెతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు

కర్కాటక రాశి: ఈ వారంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏర్పడుతాయి. వ్యాపారస్తులకు లాభం లేక పోయినా నష్టం ఉండదు. కొంతవరకు అప్పులు తీర్చే అవకాశం ఉంది.ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త పెట్టుబడుల విఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

సింహ రాశి: ఈ వారం  ఈ రాశి వారికి  అనూహ్యంగా లాభాలు అందుకుంటారు. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.   మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. విలువైన వస్తువులు, వాహనాలు కొనే అవకాశం ఉంది. సమాజంలో అత్యున్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.   డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండంది.  ఎవరికి ఎలాంటి హామీలు ఇవ్వ వద్దని పండితులు చెబుతున్నారు. . ఉద్యోగస్తులకు తమ నైపుణ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. 

కన్య రాశి: ఈ వారం ఈ రాశి వారు చేపట్టిన పనులకు మొదట్లో ఇబ్బంది కలిగినా.. వారం మధ్యనుంచి ఊపందుకుంటాయి.  గట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది.పెట్టుబడుల విషయంలో  తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీరు పడే శ్రమ అధికారుల గుర్తింపుకు నోచుకుంటుంది. కార్యాలయంలో విలువ పెరుగుతుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం శుభవార్తలు వినే అవకాశం ఉంది.. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి.వాహన డ్రైవింగ్‌లో అప్రమత్తంగా ఉండండి. 

తులా రాశి: ఈ రాశి వారికి  ఈవారం అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి.కొద్ది రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఏ పని తలపెట్టినా శ్రమ లేకుండా పూర్తి చేయగలుగుతారు.ఉద్యోగస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఎప్పటినుంచి మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు  ఈ వారం అద్భుతంగా సాగుతుంది. అనూహ్యంగా డబ్బు కలిసి వస్తుంది. ప్రతి విషయాన్ని మీకు అనుకూలంగా మలుచుకోవడంలో మీరు విజయవంతం అవుతారు. ఎప్పటినుంచి ఇబ్బంది పెడుతున్న ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 

వృశ్చిక రాశి:  ఈ రాశి వారు ఈ వారం ముఖ్యమైన విషయాలు తీసుకొనే విషయంలో పెద్దలను సంప్రదించడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లవద్దు.  ఆరోగ్య విషయాలు, ప్రయాణాలలో అప్రమత్తత అవసరం.  ఉద్యోగంలో కొద్దిగా సమస్యాత్మక వాతావరణం ఉండే అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో బిజీగా  ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా సాగి పోతాయి. ఆదాయానికి లోటుండదు కానీ.. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి.ముఖ్యమైన వ్యక్తులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది

ధనుస్సు రాశి: ఈ వారం ఈ రాశి వారికి  చాలా అనుకూలంగా ఉంటుంది.  ఉద్యోగస్తులకు చాలా ప్రశాంతంగా గడుస్తుంది. పని ఒత్తిడి తగ్గి అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సహోద్యోగుల సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపార లావాదేవీలు అద్భుతంగా సాగడంతో అనూహ్యమైన లాభాలను అందుకుంటారు. పూర్వీకుల ఆస్తి చేతికి వచ్చే అవకాశం ఉంది. కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.  ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండంది. 

మకర రాశి: ఈ వారం ఈ రాశి వారికి  గ్రహసంచారాలు అనుకూలంగానే ఉన్నాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగడంతో ఆర్థికపరంగా మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.  కొత్త పెట్టుబడులు పెడితే అనుకోని లాభాలు అందుకుంటారు.  అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్ట్​లు చేపట్టే అవకాశం ఉంది.  ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.

కుంభ రాశి: ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది.  ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గి మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అధికారులతో, సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అదనంగా కీలకమైన బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది.. వ్యాపారస్తులకు ఈ వారం పట్టిందల్లా బంగారమే అవుతుంది. మంచి ఆర్థిక లాభాలను సంపాదిస్తారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. కొంతమంది తప్పుదారి పట్టించే అవకాశం ఉంది.. అలాంటి వాకి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. 

మీన రాశి: ఈ వారం ఈ రాశి వారు  మానసికంగా కొంత  గందరగోళంగా ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది.మిత్రుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. వ్యాపార వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి.ఉద్యోగస్తులు తమ పనిపై శ్రద్ధ పెట్టండి. ఎవరు ఏమన్నా పట్టిచుకోకుండా..మీ పని మీరు చేసుకోండి. అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఏ విషయంలో కూడా మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు.  దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు...

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.