వచ్చే నెల 6న గద్దర్​ ప్రథమ వర్ధంతి సభ

వచ్చే నెల 6న గద్దర్​ ప్రథమ వర్ధంతి సభ

ఖైరతాబాద్, వెలుగు: ప్రజా గాయకుడు గద్దర్ ప్రథమ వర్ధంతి సభను ఆగస్టు 6న రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు గద్దర్ ఫౌండేషన్ చైర్మన్, గద్దర్ తనయుడు సూర్యకిరణ్ తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​ఆయన మీడియాతో మాట్లాడారు. వర్ధంతి సభలో అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, సీపీఐ, సీపీఎం, ఇతర పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొంటారని చెప్పారు.

ఈ సందర్భంగా సీనియర్​ జర్నలిస్ట్​పాశం యాదగిరి, ప్రొఫెసర్​ప్రభంజన్​యాదవ్, గాయకుడు ఏపూరి సోమయ్య, గాదె ఇన్నయ్య, రాందాసు, ఎల్లయ్య నాయక్, పృథ్వీరాజ్​యాదవ్ తదితరులు గద్దర్​తో వారికున్న అనుభవాలను పంచుకున్నారు.