బరువు పెరగడం అంత ఈజీ కాదు!

V6 Velugu Posted on Sep 29, 2021

సినిమాలో ఒక పాత్ర చేసేందుకు ఒప్పుకుంటే దానిమీద ప్రాణం పెడతారు నటులు. పాత్రకు తగ్గట్లు కనిపించేందుకు ఎన్నో కసరత్తులు చేస్తారు. తమను తాము మార్చుకునేందుకు కూడా సిద్ధపడతారు. పాత్ర డిమాండ్‌‌ను బట్టి మౌల్డ్‌‌ అవుతారు. కత్తిసాము,  గుర్రపుస్వారీ లాంటివి కూడా నేర్చుకుంటారు. అలానే కొన్ని పాత్రలకు 
బరువు పెరగాల్సి వస్తుంది. దాని కోసం కూడా మస్తు కష్టపడతారు. అలానే ఎంతో హార్డ్‌‌వర్క్‌‌ చేసింది కంగనా.

కంగనా రనౌత్‌‌ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో ఉంటుంది. కానీ, ఆమె సినిమాలు మాత్రం ‘వాహ్వా’ అనిపిస్తాయి. డిఫరెంట్‌‌ రోల్స్‌‌  చేస్తూ తన నటనకు మంచి మార్కులు కొట్టేస్తుంది ఈ బాలీవుడ్‌‌ బ్యూటీ. ఈ మధ్య ఆమె నటించిన ‘తలైవి’ సినిమాకు కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఒకప్పటి తమిళనాడు సీఎం జయలలిత క్యారెక్టర్‌‌‌‌లో ఆమె నటన బాగుందంటూ కాంప్లిమెంట్స్‌‌ వచ్చాయి. అయితే, ఆ కాంప్లిమెంట్స్‌‌ వెనుక కంగన కష్టం చాలానే ఉంది. జయలలిత క్యారెక్టర్‌‌‌‌ చేయడం కోసం ఏకంగా 20 కేజీలు బరువు పెరిగింది. ఆమే కాదు గతంలో ‘సైజ్‌‌ జీరో’ సినిమా కోసం అనుష్క కూడా 20 కేజీలు బరువు పెరిగింది. ‘దంగల్‌‌’ కోసం అమీర్‌‌‌‌ఖాన్‌‌ 25 కేజీలు బరువు పెరిగాడు. హీరోయిన్లు బరువు పెరిగి, లావుగా కనిపిస్తే ఛాన్స్‌‌లు రావు. అందుకే, పాత్రకు ఇంపార్టెన్స్​ ఇస్తూ ఎంత త్వరగా పెరుగుతారో అంతే తొందరగా తగ్గుతారు. కానీ, అది అందరు అనుకున్నంత ఈజీ కాదు. దానికి వాళ్లు చాలా కష్టపడాలి. అదే చెబుతోంది కంగన. మూడు పదుల వయసులో అలా చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడిందట. 
“ పర్మనెంట్‌‌ స్ట్రెచ్‌‌ మార్స్‌‌ వచ్చాయి, కానీ, కలముందు అవేమీ బాధ అనిపించదు” అంటూ ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్‌‌ చేసింది కంగన. ఆమె ఇలా బరువు తగ్గడం ఇదేం మొదటిసారి కాదు. 2019లో కేన్స్‌‌ ఫిల్మ్‌‌ ఫెస్టివల్‌‌కి వెళ్లాల్సినప్పుడు పది రోజుల్లో ఐదు కిలోలు బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడిక ‘తలైవి’తో పాటు ‘ధక్కడ్‌‌’, ‘తేజస్‌‌’ అనే రెండు సినిమాల షూటింగ్‌‌లు కూడా ఉండటంతో ఆరు నెలల్లో బరువు పెరిగింది.. తగ్గింది. 

హెల్దీ ఫుడ్‌‌తో బరువు పెరిగి..

బరువు పెరిగేందుకు కంగనా హార్మోనల్‌‌ పిల్స్‌‌ వేసుకుందట.దాంతో పాటుగా బరువు పెరిగేందుకు ఉపయోగపడే ఫుడ్ కూడా తిన్నది. “నేను వెయిట్‌‌ పెరిగేందుకు సినిమా డైరక్టర్‌‌‌‌ ఏఎల్‌‌ విజయ్‌‌ చాలా హెల్ప్‌‌ చేశారు. ఇంటి నుంచి చాలా ఐటమ్స్‌‌ తెచ్చేవారు ఆయన” అని చెప్పింది కంగన.

యోగా.. ఫుడ్‌‌

ఎంత తొందరగా బరువు పెరిగిందో.. అంతే తొందరగా తగ్గింది కూడా. దానికి సంబంధించి ప్రతిరోజు పోస్ట్‌‌లు పెట్టేది. ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్‌‌‌‌ చేసేది. మెడిటేషన్‌‌, ప్రాణాయామంతో పాటు రోజుకు 45 నిమిషాలు యోగా చేసి, వారానికి ఐదు రోజులు జిమ్‌‌ చేసిందట. వీటన్నింటితో పాటు ఆకుకూరలు, ఫ్రూట్స్‌‌ తినడం వల్ల వెయిట్‌‌లాస్‌‌ త్వరగా అయ్యిందట.

Tagged health, weight gain

Latest Videos

Subscribe Now

More News