
హైదరాబాద్: తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా గజ్జెల రమేష్‌బాబు ఎన్నికయ్యారు. ఆర్మూర్‌లో ఆదివారం జనరల్ బాడీ మీటింగ్‌లో కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనరల్ సెక్రటరీగా నల్లా హనుమంత రెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్‌గా నిమ్మగడ్డ వెంకటేశ్వరావు, జి.ప్రకాష్, వి.మల్లారెడ్డి, ట్రెజరర్‌గా కె.కృష్ణప్రసాద్ ఎంపికయ్యారు. కొత్త కార్యవర్గం 2029 వరకు పని చేయనుంది. ఈ ఎన్నికలకు శాట్జ్ నుంచి డీడీ చంద్రారెడ్డి, నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్ నుంచి లలితాదేవి, టీఓఏ తరఫున ఎ.లింగయ్య అబ్జర్వర్లుగా హాజరయ్యారు.