
- శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి గజ్జల యోగానంద్
హైదరాబాద్ , వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే -గజ్జల యోగానంద్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ఆఫీసులో కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శేరిలింగంపల్లి సెగ్మెంట్నుంచి యోగానంద్.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు.
యోగానంద్ మాట్లాడుతూ.. ఒక సామాన్య కార్యకర్తగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన కిషన్ రెడ్డి ఉమ్మడి ఏపీకి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండుసార్లు, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రిగా సేవలను అందించారన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.