గజ్వేల్ బల్దియాలో  ఇంటినంబర్ల రెగ్యులరైజేషన్  

గజ్వేల్ బల్దియాలో  ఇంటినంబర్ల రెగ్యులరైజేషన్  
  • కసరత్తు చేస్తున్న ఆఫీసర్లు
  • గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలిసిన విలీన గ్రామాలతో అదే నంబర్లతో కంటిన్యూ
  • మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీ కూడా గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోనే.. 
  • చాలా ఇండ్లు ఒకే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉండడంతో కన్ఫ్యూజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటి నంబర్ల క్రమబద్ధీకరణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మున్సిపాల్టీ పరిధిలో ఇంటి నంబర్ల వ్యవహారంలో ఏర్పడుతున్న గందరగోళానికి చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టేందుకు అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టణం మున్సిపాలిటీగా మారే క్రమంలో చాలా గ్రామాలు విలీనమమయ్యాయి. వీటితోపాటు మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వాసితుల  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్ఆర్ కాలనీ కూడా గజ్వేల్ మున్సిపాలిటీలో విలీనమయ్యింది. ఈక్రమంలో ఆయా విలీన గ్రామాల్లోని ఇండ్లకు పాత నంబర్లనే కొనసాగిస్తున్నారు. దీంతోపాటు గతంలో ఉన్న గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ అదే నంబర్లతో ఇండ్లు ఉండడంతో గందరగోళం ఏర్పడింది. ఈ కన్ఫ్యూజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 

కొత్త నంబర్లతోనే సమస్యకు చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గ్రామ పంచాయతీగా ఉన్న గజ్వేల్ 2012లో మున్సిపాలిటీగా మారింది. ఆ టైంలో క్యాసారం, ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి గ్రామాలు గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విలీనం చేశారు. దీంతోపాటు మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం  కొత్తగా ఆర్అండ్ఆర్ కాలనీని గజ్వేల్ మున్సిపాల్టీ పరిధిలో ఏర్పాటు చేశారు. దీంతో మొదట్లో గజ్వేల్ ఓల్డ్, న్యూ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మూడు విలీన  గ్రామాల్లో కలిపి మొత్తం  11,500 వేల ఇండ్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. దీంతోపాటు కొత్తగా మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీలో మరో 8 వేల ఇండ్లు చేరాయి. ఈ క్రమంలో మున్సిపాల్టీ పరిధిలో ఒకే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పలు చోట్ల ఉండటంతో అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల విషయంలో గందరగోళం ఏర్పడింది. మున్సిపాల్టీకి సంబంధించి యూనిక్ నంబర్ కూడా లేకపోవడంతో ఇంటి నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు తప్పనిసరిగా గ్రామం పేరు రాయాల్సి వచ్చేది. ఒకే మున్సిపాల్టీ పరిధిలో వేర్వేరు గ్రామాల పేరిట అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉండడంతో పోస్టల్, ఇతర డెలివరీల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. గజ్వేల్ మున్సిపాల్టీ పరిధిలో 1/1, 2/2, 3/3 నంబర్లు విలీన గ్రామాల్లో ఉండడంతో చిరునామాలు కనుక్కొనే విషయంలో  ఇబ్బందులు ఏర్పడుతున్నాయి . ప్రస్తుతం గజ్వేల్ మున్సిపాల్టీలో విలీన గ్రామాలు, ఆర్అండ్ ఆర్ కాలనీతో కలుపుకుని మొత్తం 19,500 ఇండ్లున్నాయి. వీటిన్నింటికీ కొత్తగా ఇండ్ల నంబర్లు కేటాయిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

ఆర్అండ్ఆర్ కాలనీలో మరో సమస్య

గజ్వేల్ మున్సిపాల్టీ పరిధిలో నిర్మించిన మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీలో సమస్య మరో రకంగా మారింది. ఈ కాలనీలో దాదాపు 8 వేల ఇండ్లున్నాయి. వీటిలో  2100 ఇండ్లలో క్రయ విక్రయాలతో పాటు కొందరు హౌజింగ్ లోన్లు తీసుకున్నారు. లోన్లు తీసుకునేటప్పుడు ఆయా ఇండ్ల యజమానులు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నట్టుగా ఐజీఆర్ఎస్ విధానంలో ఇంటి నంబర్లు తీసుకోవడంతో మరింత కన్ఫ్యూజన్ నెలకొంది. కొన్ని ఇండ్లకు మున్సిపాలిటీ నంబర్లు మరికొన్నింటికి గ్రామాల వారీగా నంబర్లు కొనసాగుతుండడంతో టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇదే సమయంలో మున్సిపాలిటీ నుంచి నంబర్లు పొందిన ఇండ్లకు 2023 నుంచి ఇంటి పన్ను చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఒకే కాలనీలో కొందరికి పన్ను విధించి మరికొందరికి పన్ను విధించక పోవడంపై  వివాదం మొదలైంది. 

సమస్య పరిష్కారంపై దృష్టి

గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటి నంబర్ల గందరగోళానికి తెరదించి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం. ఇంటి నంబర్ల వల్ల ఏర్పడుతున్న సమస్యను ప్రజలతో పాటు కౌన్సిలర్లు పలుమార్లు మా దృష్టికి తెచ్చారు. ఈ విషయమై మున్సిపల్ పాలకవర్గంలో చర్చించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాం.ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ తయారు చేస్తాం. - ఆర్.వెంకట గోపాల్, మున్సిపల్ కమిషనర్, గజ్వేల్