
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో సినిమాపై క్యూరియాసిటీని పెంచారు మేకర్స్.
అలాగే పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీతో రోజు రోజుకీ అంచనాలు పెంచుతున్నారు. తాజాగా మరో సెన్సేషన్ క్రియేట్ చేయటానికి సిద్ధమయ్యారు. ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు మరే సినిమా చేయని విధంగా ప్లాన్ చేస్తున్నారు.
డిసెంబర్ 21న అమెరికాలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నట్టు ప్రకటించారు. ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి మూవీ టీమ్‌తో పాటు పలువురు సినీ సెలబ్రిటీస్ హాజరుకాబోతున్నారు.
ఎస్‌వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల చేస్తుండగా, ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని హిందీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్. ఎస్ జే సూర్య, జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.