
రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు నిర్మిస్తున్నారు. దాదాపు ఎనభై ఐదు శాతం షూటింగ్ పూర్తయింది. తాజాగా కొత్త షెడ్యూల్‌ను సోమవారం నుంచి హైదరాబాద్‌లో మొదలుపెట్టనున్నారు. వారం రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్‌తో పాటు ఇతర నటీనటులు పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగాభిమానులు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ ఇయర్ ఎండింగ్‌లోనే ‘గేమ్ చేంజర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, ఎస్.జె.సూర్య ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.