స్టైలిష్ అర్జున ‘గాండీవధారి అర్జున’

స్టైలిష్ అర్జున ‘గాండీవధారి అర్జున’

వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య హీరోయిన్. నాగబాబు సమర్పణలో బివిఎస్‌‌‌‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది.

ప్రస్తుతం బుడాఫెస్ట్‌‌‌‌లో ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నారు. అక్కడ యాక్షన్‌‌‌‌ సీన్స్‌‌‌‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నట్టు మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోస్‌‌‌‌ కూడా షేర్ చేశారు. ఈ వర్కింగ్ స్టిల్స్‌‌‌‌లో గన్స్‌‌‌‌, బైక్స్‌‌‌‌తో స్టైలిష్‌‌‌‌గా కనిపించాడు వరుణ్ తేజ్.