రాష్ట్రంలో Trs పార్టీకి తామే సరైన ప్రత్యామ్నాయమని ప్రజలు గుర్తించారన్నారు బీజేపీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావు. బీజేపీలోకి వరదలా చేరికలు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం మిగతా పార్టీలు పోటీ పడి మరీ ఖాళీ అవుతున్నాయని చెప్పారు. గాంధీభవన్ త్వరలోనే ఖాళీ అవడం ఖాయమన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ ఇకపై మ్యూజియంలోనే కనిపించే అవకాశముందన్నారు. హైదరాబాద్ లో పలు పార్టీల నేతలు బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
